సాయి కుమార్ ప్రముఖ నటుడు మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే బుల్లి తెర పై వ్యాఖ్యాతగా కూడా పనిచేస్తున్నారు .ఈయన నటించిన తీరు ప్రేక్షకులను బాగా కట్టిపడేసిందని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇకపోతే కన్నడ , తమిళ్ భాషా చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, నంది అవార్డులను కూడా అందుకున్నారు. ఇకపోతే 1960 వ సంవత్సరంలో జూలై 27 వ తేదీన జన్మించారు.అయితే ఈ రోజు సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎవరెవరు హీరోలకు తన వాయిస్ డబ్బింగ్ ఇచ్చారో ఇక్కడ తెలుసుకుందాం..

1. రజినీకాంత్:
తమిళ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ తెలుగులో భాషా చిత్రంలో నటించాడు.. ఇక ఇందులో "ఒక్కసారి చెబితే... వంద సార్లు చెప్పినట్టే" అనే  ఈ ఒక్క డైలాగ్ గత కొన్ని సంవత్సరాల పాటు బాగా పాపులారిటీని అందుకుంది. ఇంత గొప్ప డైలాగ్ థియేటర్స్ లో మంచి క్రేజ్ ను అందుకోవడం గమనార్హం. అయితే ఈయనకు సాయికుమార్ వాయిస్ డబ్బింగ్ ఇచ్చారు. అంతేకాకుండా పెదరాయుడు సినిమాలో కూడా రజనీకాంత్ కు వాయిస్ డబ్బింగ్ ఇచ్చారు.

2. రాజశేఖర్:
రాజశేఖర్ అంకుశం సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లో నటించాడు. అయితే ఇంతటి గొప్ప వాయిస్ అందించడం కేవలం సాయి కుమార్ కు మాత్రమే చెల్లింది. కేవలం వాయిస్ తోనే సినిమా హైలెట్ అయింది అని అప్పట్లో పలు వార్తలు కూడా వచ్చాయి.

3. సుమన్:
సుమన్ నటించిన ఎన్నో సినిమాలకు సాయి కుమార్ వాయిస్ డబ్బింగ్ ఇచ్చారు.

వీరితో పాటు మరెంతో మందికి వాయిస్ డబ్బింగ్ ఇచ్చి, సినీ ఇండస్ట్రీలో కింగ్ ఆఫ్ వాయిస్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయికుమార్. అంతేకాకుండా ఒక నటుడిగా ,తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా పలు రకాల క్యారెక్టర్ లలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: