స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై ఆ తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన హీరో వేణు తొట్టెంపూడి. చివరిగా ఆయన నుంచి రామాచారి అనే సినిమా రాగా ఆ తర్వాత సినిమా అవకాశాలు ఏవి ఆయన దరి చేరలేదు. దాంతో క్రమక్రమంగా వేణు కనుమరుగైపోయారు. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తూ తాను క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించగలను అని రుజువు చేసుకున్నాడు.

దమ్ము సినిమా తో ప్రత్యేక పాత్రలు పోషించడం మొదలుపెట్టిన వేణు ఆ తర్వాత ఆ కెరీర్ ని కూడా సరిగా కంటిన్యూ చేయలేకపోయాడు. ఇప్పుడు చేస్తున్న రామారావు సినిమాతోనయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి మంచి సినిమా అవకాశాలు పొందుతాడా అనేది చూడాలి. తాను హీరో గా ఉన్న సమయంలో ఇతర హీరోల కాంబినేషన్ లో కూడా సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు వేణు. హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతి బాబు మరియు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ఆ తర్వాత కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే , ఖుషి ఖుషిశ్రీకృష్ణ 2006, యమగోల వంటి సినిమా ల్లో ఆయన ఇతర హీరోలతో తెరను పంచుకున్నారు.

ప్రకాశం జిల్లాలోని కొండపి మండలం పెరిదేపి గ్రామంలో జన్మించిన వేణు చదువు పూర్తి చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి రాగా భారతీరాజా దర్శకత్వంలో ఓ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశాన్ని అందుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఆ తర్వాత వేణు స్నేహితుడు నిర్మాతగా స్వయంవరం సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో నటనకు గాను ఆయనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది ఆ తర్వాత హీరోగా మంచి మంచి సినిమాల్లో నటించారు సహాయ నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా పలు చిత్రాల్లో పనిచేసిన ఆయన శ్రీ అంటే ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: