
ఇంతవరకు ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే దాదాపుగా గత నెల రోజుల కిందటే బిగ్బాస్ సీజన్ ఫైవ్ కి , ఎవరిని కంటెస్టెంట్ గా తీసుకువస్తే బాగుంటుంది అని ఈ షో నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు. అయితే ఈ షో కి టిఆర్పి రేటింగ్ తీసుకురావడానికి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న నటులతో పాటు టిక్ టాక్, యూట్యూబ్ ల ద్వారా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వారిని కూడా ఈ సీజన్ ఫైవ్ లోకి కంటెస్టెంట్ లుగా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇకపోతే సరికొత్తగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా షణ్ముఖ్ జస్వంత్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు యూట్యూబ్ ద్వారా షణ్ముఖ్ జస్వంత్ అలాగే దీప్తి సునయనలు లవ్ ట్రాక్ నడుపుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు పలు వీడియోల ద్వారా వీరిద్దరూ బాగా పాపులారిటీని అందుకున్నారు. మొదట షణ్ముఖ్ జస్వంత్ ను బిగ్ బాస్ షో నిర్వాహకులు సీజన్ ఫైవ్ లోకి ఆహ్వానించినప్పుడు, అతను ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని సమాచారం .కాకపోతే మొదట వద్దనుకున్నా, అతనికున్న క్రేజ్ ను చూసి , నిర్మాతలు అతను అడిగినంత ఇచ్చి సీజన్ ఫైవ్ లోకి ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి