సాదారణంగా చిత్ర పరిశ్రమలో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఇక ఇది చూసిన అభిమానులు అందరూ మురిసిపోతూ వుంటారు. అయితే ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడమే కాదు కొన్ని కొన్ని సార్లు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి.  కాగా అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ముగ్గురు హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. తండ్రి నాగార్జున ప్రస్తుతం యువ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక నాగచైతన్య ఎన్ని రోజులనుంచి చిత్ర పరిశ్రమలో బాగా రాణిస్తున్నాడు. ఇక అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే అక్కినేని హీరోలు అందరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలి అన్న అభిమానుల కోరిక మనం సినిమాతో తీరింది అన్న విషయం తెలిసిందే.  ఏకంగా తాత నాగేశ్వర రావు దగ్గర నుంచి మనవడు అఖిల్ వరకు కూడా అందరూ మనం సినిమాలో నటించారు. అంతేకాదు మొన్నటివరకు అక్కినేని వారి కోడలు గా కొనసాగిన సమంత సైతం మనం సినిమాలో నటించి అలరించింది అనే విషయం తెలిసిందే. ఇకపోతే ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి మూవీ వస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో అక్కినేని హీరోలు కలిసి నటించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.


 టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ప్రస్తుతం ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే  నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో ఆయన తనయుడు అఖిల్ ఒక గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో అఖిల్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందట. ఇకపొతే ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే ఘోస్ట్ సినిమాలో అఖిల్ ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు అన్నది మాత్రం ప్రస్తుతం అక్కినేని అభిమానులు అందరిలో కూడా ఆతృత పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: