బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరుతోంది అని పలు కథనాలు వినిపించినప్పటికీ సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తరువాత ఆ కథనాలు నిజమే అని పలుసార్లు ప్రూవ్ అయ్యాయి. ఈ విషయంలో సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా ను ఎన్‌సిబీ అరెస్ట్ చేసి విచారణ చేసింది కూడా. అయితే ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. అతడి కాల్ లిస్ట్ ఆధారంగా ఎన్‌సిబీ   అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఆర్యన్ ఖాన్ మొబైల్ డేటా ఆధారంగా బాలీవుడ్ నటీనటులు ఈ కేసులో ఏరుకుంటున్నారు. వారికి ఎన్‌సిబీ ఇప్పటికే సమన్లను పంపింది. IHG

ఈ వ్యవహారం లో ఆర్యన్ ఖాన్ ఫ్రెండ్ అయినటువంటి అనన్య పాండే పాత్రకూడా ఉందని తెలియడంతో ఎన్‌సిబీ అధికారులు గురువారం నాడు అనన్యపాండే ఇంట్లోనూ మరియు షారుఖ్ ఖాన్ ఇంట్లోనూ విస్తృతంగా సోదాలు నిర్వహించి పలు కీలకమైన ఆధారాలను సంపాదించారు. షారుఖ్ ఖాన్ ఇంట్లో ఆర్యన్ ఖాన్ కి సంబంధించి పర్సనల్ ఫోన్ , ల్యాప్టాప్ , హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అనన్య పాండే ను గత రెండు రోజులగా ఎన్‌సిబీ అధికారులు విచారణ చేస్తున్నారు. గురువారం 3 గంటలు , శుక్రవారం 4 గంటల కాలవ్యవధిలో విచారణ చేశారు.


IHG

ఆర్యన్ ఖాన్ అనన్య పాండే తో చేసిన వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ఈ  విచారణ కొనసాగింది. అయితే ఈ వాట్సాప్ చాట్ లో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ దొరుకుతుందా అని అడుగా ఆమె దొరుకుతుంది తెచ్చి ఇస్తానని చాట్ పేర్కొంది. ఈ చిన్న చాట్ ఆధారంగా ఆమెను పలు కోణాల్లో ప్రశ్నలను వేశారు కానీ ఆమె మాత్రం సింపుల్ గా తాను జోక్ చేసానని చెప్పి తప్పించుకుంది. ఆపై ఆమెను ప్రశ్నించడానికి వేరే అధరాలు లేకపోవడం, అందులోను ఆమె డ్రాగ్ తెచ్చి ఆర్యన్ కి ఇచ్చినట్లు అధరాలు లేవు దింతో విచారణ సోమవారానికి  వాయిదా వేశారు. సోమవారం ఈ విషయం పై  పలుకోణాల్లో విచారణ జరిపే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: