సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన దూకుడు ను చూపించలేక పోతున్నాడు, వరుసగా రజనీ కాంత్ నటించిన కబాలి, కాలా, దర్బార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద  పరాజయం పాలయ్యాయి. ఇ లాంటి సందర్భం లోనే బాక్సాఫీస్ దగ్గర అదిరి పోయే విజయాన్ని అందు కోవాలి అనే ఉద్దేశంతో సూపర్ స్టార్ రజినీకాంత్, శివ దర్శకత్వం లో పెద్దన్న సినిమా లో నటించాడు,  విడుదల వరకు ఈ సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి అంచనాలు నెలకొన్నాయి, దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో రజనీకాంత్ హీరో గా నటించడం, అలాగే రజనీకాంత్ సరసన నయన తార హీరోయిన్ గా నటించడం, సీనియర్ స్టార్ హీరోయిన్ లు అయిన కుష్బూ, మీనా లు ప్రధాన పాత్రలు పోషించడం ఇలా అనేక కారణాల వల్ల ఈ సినిమాపై జనాలు అంచనాలు పెరిగిపోయయి.

ఇలా ఎన్నో అంచనాలతో థియేటర్ లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఘోర పరాజయం గా మిగిలిపోయింది. ఇలా ఈ సినిమా రిజల్ట్ తెలిపి పోవడంతో రజనీకాంత్ తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది, రజినీకాంత్ , ఇప్పటికే తమిళ ఇండస్ట్రీ లో దర్శకుడి గా మంచి పేరు తెచ్చుకున్న పాండిరాజ్ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న ట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు  సోషల్ మీడియా లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజ మో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడా ల్సిందే. ఇది ఇలా ఉంటే తనకు పెద్దన్న సినిమా తో హిట్ సినిమా ఇవ్వ లేక పోయినా శివ దర్శకత్వం లో రజనీకాంత్ మరొక సినిమా లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: