టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పిన తక్కువే. దక్షిణ భారతదేశంలో అత్యధిక మాస్ అభిమానులు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఫ్యాన్స్ వున్న భారతీయ నటులలో మహేష్ ఖచ్చితంగా ఉంటాడు. కెరీర్ లో ఎన్ని అపజయాలు విజయాలు వచ్చిన ఏమాత్రం తగ్గకుండా గర్వపడకుండా చాలా సింపుల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. బహుశా ఆ సింప్లిసిటీనే ఈ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల అభిమానులని సంపాదించిపెట్టింది. ఇక టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి సోషల్ మీడియాలో కూడా క్రేజ్ అంతా ఇంతా లేదు.ఆఫ్లైన్ లోనే కాకుండా ఆన్లైన్ లో కూడా మహేష్ బాబు సూపర్ స్టారే అని చెప్పాలి. ఇది గతం నుంచి రుజువు అవుతూనే వుంది. ఇక తాజాగా కూడా మరోసారి రుజువు అయ్యింది. ఇక సూపర్ స్టార్ మహేష్ ఖాతాలో తాజాగా ఓ సెన్సేషనల్ రికార్డు నమోదయ్యింది.

అదేంటంటే..ట్విట్టర్ లో మహేష్ బాబుని ఫాలో అయ్యేవారి సంఖ్య ఇప్పుడు 12 మిలియన్లకు చేరుకుంది. ఇది సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే ఏ సెలబ్రేటి ఇంకా టాప్ హీరోలు దరిదాపుల్లోకి కూడా రాని రికార్డు.అటువంటి రికార్డు కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే నమోదు చేసాడంటే మహేష్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా ట్విట్టర్ లో ఫాలోవర్స్ పెరగడం అంటే ఆషామాషీ విషయం కాదు. అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ రికార్డు నెలకొల్పి సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరో అయ్యాండంటే మహేష్ క్రేజ్ మాములుగా లేదని చెప్పాలి. ఇది నిజంగా సూపర్ స్టార్ మహేష్ అభిమానులు కాలర్ ఎగరేసి చెప్పుకునే రికార్డు. ఇక ఈ రికార్డు మహేష్ పేరిట నమోదు కావటంతో మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.


https://twitter.com/urstrulyMahesh?t=u6gCAmgcRPWqiTb7yx8Pgw&s=09

మరింత సమాచారం తెలుసుకోండి: