అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా, నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు రాశి ఖన్నా అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దగ్గడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.  అందులో భాగంగా హైపర్, బెంగాల్ టైగర్, వరల్డ్ ఫేమస్ లవర్, శివమ్, సుప్రీమ్, జిల్, జై లవ కుశ, జోరు వంటి పలు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ఇలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, నాగ చైతన్య తో రాశి ఖన్నా కు ఇది రెండో సినిమా, ఇదివరకే వీరిద్దరూ వెంకీ మామ సినిమాలో కలిసి నటించారు, ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాతో పాటు రాశి ఖన్నా, గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇలా టాలీవుడ్ లో సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రాశి ఖన్నా ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ పైన కూడా తన ఫోకస్ పెట్టింది. రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలలో మరియు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది, రాశి ఖన్నా ప్రస్తుతం టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: