ప్రేమకథ సినిమాలను ఎంతో అద్భుతంగా చేసి ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆనందింపంచేశాడు వేణు తొట్టెంపూడి. ఆయన కెరియర్ లో ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆలరించగా ఆ తర్వాత కాలంలో ఆయన ఎందుకో మంచి సినిమాలను చేయడంలో వెనుకబడి పోయారు. యువ హీరోలు రావడం ఆయన సినిమాల ఎంపికలో పొరపాట్లు జరగడం వంటివి ఆయనకు టాలీవుడ్ కెరీర్ లేకుండా చేసింది. మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు ఏమాత్రం కలిసిరాలేదు. ఇప్పుడు రవితేజ హీరోగా చేస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి వేణు తొట్టెంపూడి కి ఈ చిత్రం మళ్లీ కం బ్యాక్ చేస్తాడా అనేది చూడాలి.
అలాగే రవితేజ రావణాసుర సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సుశాంత్ ది కూడా ఇదే పరిస్థితి. మొదట్లో ఆయన మంచి మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు ఆయన కెరీర్ టాలీవుడ్ లో దాదాపు ఎండింగ్ కు వచ్చిందనే చెప్పాలి. ఆయనకు పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. వచ్చినా కూడా అవి ప్రేక్షకులను ఏమాత్రం చూపించక పోవడంతో నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే రవితేజ రావణాసుర చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సుశాంత్ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.