నందమూరి బాలకృష్ణ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఓ పట్టాన మార్చుకోడు. ఎంతో ప్రమాదం ముంచుకొస్తే తప్ప దాన్ని మార్చుకోడు అలా ఇప్పుడు ఆయన తన తదుపరి సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పక మార్చుకోవాల్సి వస్తుంది. ఆయన హీరోగా చేసిన అఖండ చిత్రం భారీ స్థాయిలో విజయం సాధించి ఆయనకు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఓ టీ టీ లో విడుదల అయినా కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఇమేజ్ రావడం ఒక్కసారిగా బాలకృష్ణ స్థాయిని తెలియజేస్తోంది.

ఈ చిత్రం విడుదలకు ముందే ఆయన తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే దాని పూజా కార్యక్రమాలను కూడా భారీ స్థాయిలో నిర్వహించారు. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని భావించగా నిన్నటి దాకా కూడా ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారంలో మొదలు కాబోతుంది అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా వేయడం ఇప్పుడు నందమూరి అభిమానులు మాత్రమే కాదు సినిమా ప్రేక్షకులను కూడా ఆశ్చర్య పరుస్తుంది.

అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా బాలకృష్ణ ఆరోగ్యం దృష్ట్యా ఈ సినిమాను వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలుపుతుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తన కెరీర్ లోనే గొప్ప సినిమాగా మిగిలిపోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా పోయిన ఏడాది క్రాక్ సినిమా తో ఘన విజయం సాధించి ఇప్పుడు బాలకృష్ణ కోసం అలాంటి ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడ ని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు బాలయ్యను మళ్లీ థియేటర్లలో చూడగలుగుతాము అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎంతగానో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: