హీరోలు అందరూ కూడా మాస్ సినిమాల మంత్రాన్ని జపిస్తూన్నారు. అందరు హీరోలు కూడా మాస్ సినిమాలైతేనే చేస్తామని దర్శకులకు తేల్చిచెప్పడంతో అలాంటి సినిమాల కథలను తయారు చేయడానికే దర్శకులు సిద్ధం అవుతున్నారు. పలువురు హీరోలు ఇప్పటికే కొన్ని మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్లు సాధించగా ఇప్పుడు మరింత మంది హీరోలు ఈ విధమైన సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. తమ వద్దకు వచ్చే దర్శకులకు కూడా ఈ విధమైన కథలు తయారు చేయాలని చెబుతున్నారు.

ఆ విధంగా మన హీరోలు అందరూ కూడా ఇప్పుడు మాస్ సినిమాలను మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. పుష్ప సినిమా తర్వాత హీరోల అందరి అభిప్రాయం పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా మంది దర్శకులు తమ పంథాను మార్చుకుని మాస్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో యువ హీరోలు కూడా ఈ విధం గా మారడం మాస్ ప్రేక్షకులకు పండగ లాంటిదే అని చెప్పాలి. 

మరి మాస్ ప్రేక్షకులను అలరించే సినిమాలు చేస్తూ మన హీరోలు మంచి సినిమాలను చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో క్లాస్ సినిమాలను మెచ్చే ప్రేక్షకులు ఏ విధంగా ఈ సినిమాలను స్వాగతిస్తారో చూడాలి. అలా ఇప్పుడు పెద్ద హీరోలైన చిరు, ప్రభాస్ దగ్గరనుంచి మాస్ రాజా రవితేజ దగ్గరనుంచి చిన్న హీరోలు అయినా నాని నిఖిల్ వంటి వారి వరకు కూడా ఈ విధమైన మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఆ సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాయో చూడాలి. రవితేజ ఇప్పటివరకు మాస్ కోణంలో ప్రతి సినిమా చేస్తుండగా అందరు హీరోలు కూడా ఐవ్ధంగా సినిమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్క హీరో కూడా ఇప్పుడు అలాంటి సినిమా చేస్తూ ఉండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: