తెలుగు సినీ ప్రేమికులకు యాంకర్ సన్నీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట టీవీ యాంకర్ గా వ్యవహరించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సన్నీ ఆ తర్వాత సీరియల్ లలో కూడా నటించాడు. సీరియల్ ల ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసులు దోచుకున్న సన్నీ అనూహ్యంగా బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో లో ఛాన్స్ దక్కించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా ఎంటరయిన సన్నీ ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ గా అయ్యాడు.

ఇలా మొదట యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టి , ఆ తర్వాత సీరియల్ ద్వారా బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసులు దోచుకున్న సన్నీ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే సన్నీ మరో సినిమాను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే... డైలాగ్ కింగ్ మోహన్ బాబు తాజాగా సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే.

 ఈ సినిమాకు డైమండ్ రత్న బాబు దర్శకత్వం వహించాడు. సన్ ఆఫ్ ఇండియా సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్ల పడింది. అయితే ఈ సినిమాతో దర్శకుడు డైమండ్ రత్నబాబు కూడా పెద్ద గొప్ప పేరు ఏమీ రాలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు సన్నీ తో ఒక సినిమా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అందులో భాగంగా సన్నీ కి  కథనం కూడా ఈ దర్శకుడు వినిపించినట్లు,  సన్నీ కూడా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: