ఇటీవల ఐకాన్ అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప.ఈ సినిమా ఎ రేంజ్ లో ప్రశంసలను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇకపోతే ఈ సినిమాలో 5 స్టార్ అల్లు అర్జున్ కి జోడిగా బ్యూటీ  రష్మిక మందన నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయిన అనంతరం భారీ వసూళ్లను అందుకుంది. ఇదిలా ఉంటే పుష్ప సినిమా తరువాత పుష్ప2 కూడా రానున్న సంగతి తెలిసిందే. అయితే తాజగా  'పుష్ప 2' సినిమాను త్వరలో పట్టాలెక్కిస్తారట.అయితే  ఈ నేపథ్యంలో కాస్టింగ్‌ విషయంలో చర్చలు తుది దశకు వచ్చాయట. 

కాగా  సినిమాలోకి కీలకమైన పోలీసు అధికారి పాత్రకు ఈషా గుప్తాను తీసుకున్నారని తెలుస్తోంది.ఇకపోతే 'పుష్ప'లో ఈషా గుప్తా అంటూ గతంలోనే వార్తలొచ్చాయి.అయితే సినిమాలో  'ఉ అంటావా ఊ ఊ అంటావా..' అంటూ సమంత ఆ మధ్య ఓ ఊపు ఊపేసిన పాట ఉంది కదా.ఇక తాజాగా సమాచారం ప్రకారం  అందులో తొలుత నర్తించాల్సిన నాయిక ఈషా గుప్తానేనట.తాకితే  ఆమెను ఫైనల్‌ చేశారు అని వార్తలొచ్చినప్పుడే 'కాదు కాదు సమంత' అంటూ అసలు విషయం చెప్పేసింది మైత్రీ టీమ్‌. అప్పటికే ఈషా గుప్తాకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారనే వార్తలు వచ్చాయి.

తాజాగా ఇప్పుడు ఆ అడ్వాన్స్‌తోనే 'పుష్ప 2'లో ఈషా గుప్తాను తీసుకున్నారని సమాచారం.అంతేకాకుండా 'పుష్ప 2' లో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందట. ఇక ఆ పాత్రలో ఈషా గుప్తాను తీసుకున్నారని చెబుతున్నారు.ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ 50 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అంతేకాదు అలాగే సినిమాలో శ్రీవల్లి పాత్రను చంపేస్తున్నారని అంటున్నారు. అయితే సినిమా రొమాన్స్‌ పాళ్లు కలపడానికి శ్రీవల్లి పాత్రను లేపేసి, వేరే హీరోయిన్‌ తీసుకొస్తున్నారనే టాక్‌. తాజాగా వినిపిస్తున్న  మరో ఇంట్రెస్టింగ్‌ రూమర్‌ ఏంటంటే.ఈ  సినిమా సెకండాఫ్‌లో హీరోను విదేశాలకు తీసుకెళ్తారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: