సాధారణంగా  సినిమాలు దసరా దీపావళి సంక్రాంతి సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతూ ఉంటాయి. అయితే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆగష్టు నెల పెద్ద సీజన్ కాదు. ఆ నెలలో స్వాతంత్ర దినోత్సవం పండుగ ఉన్నప్పటికీ ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా సినిమాలు ఎక్కువగా విడుదలకావు. అయితే ఈసారి రాబోతున్న స్వాతంత్ర దినోత్సవానికి ఒక చరిత్ర ఉంది.


ఆరోజుతో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ‘అమృత మహోత్సవ్’ పేరుతో గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు జరిగిన అనేక కార్యక్రమాలకు ఆరోజున ముగింపు పలుకుతారు. ఈసారి ఉత్సవాలలో భాగంగా ఆగష్టు 15న విడుదల కాబోతున్న సినిమాల లిస్టు చూస్తుంటే ఎవరైనా షాక్ అవుతారు.


నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ సమంత ‘యశోదర’ సినిమాలతో పాటు మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు కూడ విడుదల కాబోతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి అత్యంత కీలకంగా మారిన అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ మూవీలు కూడ అదే సీజన్ ను టార్గెట్ చేస్తూ ఆగష్టు 12న విడుదల కాబోతున్నాయి. ఇలా ఆరోజున విడుదల కాబోతున్న సినిమాల సంఖ్య చూస్తే సుమారు 8 సినిమాల వరకు ఉంటున్నాయి.


ఈ పరిస్థితులు ఇలా ఉంటే దేశవ్యాప్తంగా జూలై చివరకు కరోనా కేసులు భారీ స్థాయికి చేరుకుంటాయి అన్న హెచ్చరికలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడ కరోనా కేసులు పెరుగుతున్నాయి అంటూ లేటెస్ట్ గా హెచ్చరికలు చేసింది. ఇలాంటి పరిస్థితులలో ఇన్ని భారీ మీడియం రేంజ్ సినిమాలు ఏధైర్యంతో విడుదల అవుతున్నాయి. ఒకవేళ విడుదల అయినా కరోనా భయాలు పక్కకు పెట్టి ధైర్యంగా జనం ఎన్ని సినిమాలను ధియేటర్లకు వచ్చి చూస్తారు అన్న విషయం సమాధానం లేని ప్రశ్న. మరొకసారి కరోనా పరిస్థితులు చేయదాటిపోతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఫిలిం ఇండస్ట్రీకి మరొకసారి దెబ్బపడే ఆస్కారం ఉంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: