టాలీవుడ్ సినీ ప్రేమికులకు శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ విష్ణు హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్యనే శ్రీ విష్ణు 'భళా తందనాన' అనే సినిమాలో నటించాడు. 

సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. దానితో చివరగా భళా తందనాన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీ గా మిగిలిపోయింది. ఇలా బాక్సాఫీస్ దగ్గర భళా తందనాన మూవీ తో అపజయాన్ని ఎదుర్కొన్న శ్రీ విష్ణు ప్రస్తుతం అల్లూరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు 'నిజాయితీకి మారు పేరు' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా , ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లూరి సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.

అల్లూరి సినిమా టీజర్ ను జూలై 4 వ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో శ్రీ విష్ణు పోలీస్ యూనిఫామ్ వేసుకుని, చేతిలో గన్ ని పట్టుకుని నిల్చొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  అల్లూరి సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా , ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: