రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మహానటి మూవీ తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దర్శకుడు నాగ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు.

మూవీ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె , ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా , బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో ఈ మూవీ లో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... ఈ మూవీ లో ఇంటర్వెల్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది అని , బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర ఇంటర్వల్ లో ప్రభాస్ రెండో క్యారెక్టర్ ను పరిచయం చేస్తుంది అని ,  ఈ మూవీ లో ఇది అదిరిపోయే ట్విస్ట్ గా రివీల్ అవుతుందని ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. తదుపరి షెడ్యూల్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్  మూవీ ని వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నాడు.  భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ ఎ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రభాస్మూవీ తో పాటు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ , ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి భారీ బడ్జెట్ మూవీ లలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: