ప్రస్థుతం ఇండస్ట్రీలో అంతా అయోమయం నెలకొని ఉందని ఏసినిమాలు వర్కౌట్ అవుతాయో ఏసినిమాలు ఫ్లాప్ అవుతాయో తలలు పండిన వారికి కూడ అర్థం కావడం లేదు అంటూ రాశి ఖన్నా కామెంట్స్ చేసింది. కోవిడ్ పరిస్థితుల తరువాత ఓటీటీ లకు జనం బాగా అలవాటు పడిపోవడంతో వెరైటీ కథలను జనం కోరుకుంటున్నారని అయితే ప్రేక్షకులకు నచ్చే ఆ వెరైటీ ఏమిటో తెలుసుకోవడం చాల కష్టంగా ఉంది అంటూ రాశి ఖన్నా అభిప్రాయపడుతోంది.


దీనితో సినిమాలు తీసే దర్శక నిర్మాతలు మాత్రమే కాకుండా నటించే నటీనటులు కూడ కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆమె అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితులలో సినిమా విడు దలై ఫలితం వచ్చే దాకా దేవుడు పై భారం వేయడం తప్ప చేయగలిగింది ఏమి లేదు అంటోంది. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని మనకు ఏదిరాసిపెట్టి ఉంటే అది జరుగుతుందని ఎంత ప్రయత్నించినా విధికి ఎదురీదలేము అని అంటోంది.


ప్రస్తుతం తాను బ్రహ్మకుమారీస్ ఆలోచనా విధానాలకు తన మనసు బాగా దగ్గర అవుతోందని తనకు అవకాశం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తున్నాను అని అంటోంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను నటిని అవుతానని తాను ఎప్పుడు అనుకోలేదని సరదాగా ఒక సినిమా ఆడిషన్ కు టైమ్ పాస్ కోసం వెళితే అక్కడ తనను సెలెక్ట్ చేసారు అంటోంది. వాస్తవానికి ఏహీరోయిన్ మనస్పూర్తిగా గ్లామర్ షో చేయదని నటించడానికి అవకాశం ఉన్న పాత్రల కోసం వేచి చూడాలని అనిపించినా ఎవరికి వారికి తెలియని అబధ్రతా భావంతో గ్లామర్ షోలు చేయవలసి వస్తోంది అని అంటోంది.


జీవితంలో ప్రతివ్యక్తి ఎన్నో అనుకుంటాడని అయితే అన్నీ జరగవని జరగనందుకు నిరాశపడకుండా లైఫ్ జర్నీని కొనసాగించడమే జీవితం అంటోంది. హీరోయిన్స్ చుట్టూ తిరిగే కథల సినిమాలను జనం ఆదరిస్తున్నారని అయితే అలాంటి కథలను తీయడానికి చాలామంది దర్శకులు నిర్మాతలు ముందుకు రాకుండా రొటీన్ సినిమాలు చూస్తూ తమను గ్లామర్ డాల్స్ గానే చూస్తున్నారు అని రాశి ఖన్నా అభిప్రాయపడుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: