మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు తెలుగునాట ఎంతటి స్థాయిలో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు తన పాత్ర ద్వారా వారందరినీ కూడా మెప్పిస్తుంది. అందుకే ఈ హీరోయిన్ కు ఎక్కువగా క్రేజ్ నెలకొని ఉంది. నితిన్ హీరోగా నటించిన అ ఆ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది.

మొదట్లో ఎక్కువగా సాంప్రదాయ బద్ధమైన పాత్రలలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపించింది కానీ గ్లామర్ హీరోయిన్ లకు మాత్రమే ఎక్కువగా క్రేజ్ ఉంటుందని భావించి ఈమె కూడా ఆ విధమైన గ్లామర్ ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది అలా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో చిన్న హీరోలతో నటించిన వారి సినిమాలలో రొమాన్స్ బాగా పండించడం వంటివి జరగడం ఆమె అభిమానులను ఏమాత్రం మెప్పించడం లేదు.

కారణం ఏదైనా కూడా ఆమె స్థాయికి పెద్ద హీరోలతోనే నటించాలని వారి కోరిక కానీ పెద్ద సినిమాల అవకాశాలు తనకు ఇప్పుడు రావని గ్రహించే ఆమె ఈ విధమైన పాత్రలు చేస్తుంది అంటున్నారు మరి భవిష్యత్తులో అయినా ఆమెకు పెద్ద హీరోల సరసన నటించే సినిమా అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె చేతిలో నిఖిల్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలు ఉన్నాయి ఈ చిత్రాల ద్వారా ఆమె మంచి సక్సెస్ కనుక సాధిస్తే తప్పకుండా వేరే స్థాయి హీరోయిన్ అవడం ఖాయం అని చెప్పొచ్చు. కార్తికేయ 2 సినిమా లో ఈమెకు మంచి పాత్ర దక్కింది అని చెప్తున్నారు. అలాగే నిఖిల్ 18 పేజెస్ సినిమాలోనూ ఈమెకు మంచి పాత్ర వచ్చింది. ఇవి రెండు కూడా యూత్ కి ఆకట్టుకుంటాయని అంటున్నారు. మరి ఆమె రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: