ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో ముందుగా ఆది పురుష్ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే క్లారిటీ ప్రతి ఒక్కరిలో ఉంది. ఓం రౌత్ దర్శకత్వం లో రామాయణం ఆధారంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ స్థాయిలో భారీ బడ్జెట్లో పొందిన ఈ సినిమా తప్పకుండా ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆదరిస్తుంది అనీ చిత్ర బృందం చెబుతుంది. ఇతిహాసాలను ఎంతో గొప్పగా చూపిస్తూ ఈ సినిమా రూపొందిన నేపథ్యంలో ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాతో పాటే ప్రభాస్ మరికొన్ని సినిమాలను చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అయితే వాటి లో ఏ సినిమా విడుదలవుతుందో అన్న క్లారిటీ మాత్రం రావడం లేదు. ఇప్పుడు ప్రాజెక్టు కే సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఆ తరువాత మారుతి సినిమా చేయబో తున్నాడట. విడుదలకు మూడు సినిమాలను సిద్ధం చేస్తున్న ప్రభాస్ పరిస్థితిని బట్టి ఏ సినిమాను విడుదల చేయాలో అన్న ఆలోచన చేస్తున్నాడట. ప్రస్తుతానికైతే చాలా చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేయడానికి చూస్తున్నాడు.

ఆపై వచ్చే ఏడాదిలో ప్రాజెక్టు కే సినిమాను విడుదల చేయబోతున్నారు. అయితే ఆది పురుష్ చిత్రం విడుద లైన తరువాత అంత గ్యాప్ ప్రభాస్ ఇవ్వడం నిజంగా ప్రభాస్ అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. మారుతి సినిమాను మధ్యలో విడుదల చేస్తే బాగుంటుంది అ నేది వారు చేసే సూచన. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ హీరో మంచి కం బ్యాక్ చేయాలి అంటే తప్పకుండా తొందరగా ఆయన నటించిన సినిమాలను విడుదల చేయవలసి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: