జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వరకు జబర్దస్త్ లో మాత్రమే కాదు ఈటీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో కూడా పంచ్ ప్రసాద్ ఆటో పంచులతో ఎంతోమంది అభిమానులను దృష్టిని ఆకర్షించాడు. ఇక బుల్లితెర ప్రేక్షకులు అందరినీ కూడా కడుపుబ్బా  నవ్వించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఈటీవీలో ఒక టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు పంచ్ ప్రసాద్.


 ఇక ఇటీవల కాలంలో అయితే పంచ్ ప్రసాద్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఉండడం ఖాయం అన్నది మాత్రం ప్రేక్షకులు అనుకుంటున్న మాట. అయితే ప్రస్తుతం ఈటీవీలోని పలు కార్యక్రమాల ద్వారా పంచు ప్రసాద్ బాగా పాపులారిటీ సంపాదించడమే కాదు ఇక ఆదాయం కూడా ఎక్కువగానే సంపాదిస్తున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు లాంటి ప్రత్యేకమైన ఈవెంట్స్ లో అన్ని కార్యక్రమాలలో కూడా పంచు ప్రసాద్ కనిపిస్తూ తన పంచులతో అలరిస్తున్నాడు.


 అయితే ఒకానొక సమయంలో కనీసం తన ఆరోగ్య సమస్యలకు హాస్పిటల్లో చికిత్స తీసుకునేందుకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడిన పంచ్ ప్రసాద్.. ఇప్పుడు మాత్రం ప్రతి నెల మూడున్నర లక్షల నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. అందులో లక్షన్నర హాస్పిటల్ ఖర్చులకు పోను మిగతావి తన ఖర్చులకు ఉపయోగించుకుంటున్నాడని తెలుస్తుంది  అంతేకాదు జబర్దస్త్ లోని కొంతమంది దాతలు సహాయంతో కూడా ట్రీట్మెంట్ పొందుతున్నాడు పంచ్ ప్రసాద్. అంతేకాదు బయట ఈవెంట్ల ద్వారా కూడా పంచ్ ప్రసాద్ బాగానే సంపాదిస్తున్నాడట. తనకున్న ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా తన కెరియర్ పై దృష్టి పెట్టిన పంచ ప్రసాద్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: