తాజాగా సమంత హీరోయిన్ గా యశోద అనే సినిమా రిలీజ్ అయింది.ఇక  పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదలైంది.అయితే  విడుదలైన మొదటి ఆట నుంచి ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.ఇకపోతేఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఇక శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో హరి, హరీష్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి లాభాల బాటలో పయనిస్తోంది.అయితే  కొత్త సినిమాలు ఎంట్రీ ఇవ్వడంతో కాస్త వసూళ్ళు తగ్గినా పలుచోట థియేటర్లలో మాత్రం ఈ సినిమాకి ఎలాంటి ఢోకా కనిపించడం లేదు. 

ఇప్పుడు యశోద సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో సిటీ సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది.ఇక  ఈ సినిమా ఓటీటీలో విడుదల కాకుండా చూడాలని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది.ఇకపోతే  యశోద సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు నిషేధం విధిస్తున్నామని కూడా కోర్టు పేర్కొంది.ఇక ఈ మేరకు యశోద సినిమా యూనిట్ కు అదనపు చీఫ్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.అయితే  ఈవా ఐవిఎఫ్ హాస్పిటల్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా యశోద సినిమాలో సమంత క్యారెక్టర్ ఈవా హాస్పిటల్ రిప్యుటేషన్ దెబ్బతినేలా ఉంటుందని పిటిషన్లో పేర్కొన్నారు.

ఇక  యశోద సినిమాలో హాస్పిటల్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చిత్రీకరించారని సినిమాలో చూపించిన హాస్పిటల్ పేరు వలన ప్రస్తుతం నడిచే తమ హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతింటుందని పిటిషన్లో పేర్కొన్నారు.అయితే  ఈ నేపథ్యంలో యశోద సినిమాను నిర్మించిన శ్రీదేవి మూవీస్ బ్యానర్ కు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాని డిసెంబర్ 19వ తేదీ వరకు ఓటీటీలో రిలీజ్ చేయడానికి వీలు లేదని పేర్కొన్న సిటీ సివిల్ కోర్టు ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. యశోద సినిమాలో కృత్రిమ గర్భధారణ అనే విషయాన్ని హైలైట్ చేశారు, సరోగసి ద్వారా పిల్లలను కనే విషయం మీద సినిమా ఉంటుందని ముందు అందరూ భావించారు.  ఈ సినిమా వేరే పాయింట్ తో సాగుతుంది.ఈ సినిమాలో చూపించిన సరోగసి సెంటర్ పేరు కూడా ఈవా సరోగసి సెంటర్ కావడంతో ప్రస్తుతం ఈవా హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతింటుందని యాజమాన్యం కోర్టుకు ఎక్కినట్లు అయింది.అయితే  ఒకరకంగా నాగచైతన్య పుట్టినరోజు నాడే సమంతకు షాకింగ్ నోటీసులు వచ్చాయని కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.ఇక  ఈ విషయం మీద సమంత, యశోద మూవీ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: