టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఇప్పటికే తమిళ్ రిమేక్ వినోదయ సీతం సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయి విడుదల కి కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు మరోసారి ఇదే కాంబినేషన్లో ఇంకో సినిమా కూడా ఓకే అయ్యింది అన్న సమాచారం వినబడుతుంది. కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కనిపించడట.కానీ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ అయిన పవన్ క్రియేటివ్ బ్యానర్స్ లో తేజ్ ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి చాలా దగ్గర సన్నిహితుడైన ఒక నిర్మాతసినిమా నిర్మాణంలో భాగం కూడా

 పంచుకోబోతున్నట్లుగా సమాచారం. నిర్మాతే కాకుండా డైరెక్టర్ కూడా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసిన డైరెక్టర్ అని అంటున్నారు. ఈ మధ్యకాలంలోనే పవన్ కళ్యాణ్ తో సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్న ఒక యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తీయబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఓకే అయిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది.ఇదిలావుంటే ఇక ఇప్పుడు తాజాగా విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు తేజ్. ఈ జోరులోనే ఇప్పటికే మరో రెండు మూడు ప్రాజెక్టులకు కూడా తేజ్ ఓకే చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అందులో ఈ ప్రాజెక్టు కూడా ఒకటి అని అంటున్నారు.ఇక తాజాగా సాయి తేజ నటించిన విరుపాక్ష మూవీ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంది. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా కేవలం నాలుగు రోజులకే బ్రేక్ ఈవెంట్ టార్గెట్  పూర్తిచేసుకుని.. 50 కోట్ల క్లబ్ లో చేరింది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తేజు సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: