ఒక్క ఛాన్స్ ..ఒకే ఒక్క ఛాన్స్ .. "ఖడ్గం" సినిమాలో సంగీత చెప్పే ఈ డైలాగ్ ప్రతి ఒక్కరు లైఫ్ లో వాడే ఉంటారు.  ఒక్క ఛాన్స్ ఇస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అంటూ చాలామంది తమ లైఫ్ లో ఈ డైలాగులు ఎక్కువగా వాడుంటారు.  అది సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు ..వేరే రంగం కావచ్చు.. సినిమా ఇండస్ట్రీ కావచ్చు.. బిజినెస్ పర్సన్స్ కావచ్చు బిజినెస్ ప్రమోటర్స్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు . ఎవరైనా సరే ఒక ఛాన్స్ ఇస్తేనే కదా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ బయట పడుతుంది . వాళ్ళల్లో ఉన్న ఫ్లాస్ ఏంటో వాళ్లకి తెలుస్తుంది . అయితే ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అంటూ ఓ హీరోయిన్ డైరెక్టర్స్ తో డైరెక్ట్ గానే డీల్ మాట్లాడేసుకుంటుంది.


దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు తెలుగు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు పూజ హెగ్డే . బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఫ్లాప్స్ అందుకొని డిజాస్టర్ హీరోయిన్ అంటూ ట్యాగ్ చేయించుకున్న పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు ఎంతలా మారిపోయింది అనేది అందరికీ తెలుసు.  నమ్మి ఒక్కరంటే ఒక్క డైరెక్టర్ కూడా పూజ హెగ్డే కి అవకాశం ఇవ్వలేకపోతున్నారు.  ఇచ్చిన అవకాశాన్ని కూడా పూజ హెగ్డే ఉపయోగించుకోలేకపోయింది.  రీసెంట్ గానే "రెట్రో" సినిమాలో నటించింది . ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ జీరో . అసలు ఆమెను ఎందుకురా ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టారు ..? అంటూ సూర్య ఫ్యాన్స్ మండిపడ్డారు . పూజ హెగ్డే ఒకప్పటిలా నటించలేక పోతుంది. గ్యాప్ రావడం కారణంగానో లేకపోతే ఆమెలో అసలు టాలెంట్ లేదో.. ఏమో రీజన్ ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె నటన పై దారుణతి దారుణంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.



అయితే సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న పూజ హెగ్డే మాత్రం అవకాశాల కోసం ఫైనల్లీ వేయకూడని స్టెప్ కూడా వేసేసింది అంటూ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది.  సాధారణంగా యంగ్ ఏజ్ లో ఉన్న హీరోయిన్స్ తమ ఏజ్ కన్నా ఎక్కువగా ఏజ్ అనిపించే పాత్రను ఓకే చేయరు . అది అందరికీ తెలిసిందే.  కానీ పూజ హెగ్డే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి ప్రాజెక్టును ఓకే చేసినట్లు తెలుస్తుంది.  సోషల్ మీడియాలో ఈ న్యూస్బాగా ట్రెండ్ అవుతుంది . పూజ హెగ్డే ఒక బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ కి అక్క క్యారెక్టర్ లో కనిపించబోతుందట . నిజానికి పూజ హెగ్డే ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్ ఏది చేయలేదు .



కానీ ఇప్పుడు ఆమెకి క్రేజ్ లేదు . మొత్తం ఆమె నెగెటివిటీ సంపాదించుకునేసింది. కాగా ఇప్పుడు పూజా హెగ్డే అడిగిన రోల్ డైరెక్టర్స్ ఇచ్చే పొజిషన్లో లేరు .. డైరెక్టర్ చెప్పిన రోల్స్ లోనే పూజ హెగ్డే అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి . ఈ మూమెంట్లోనే ఒక స్టార్ బాలీవుడ్ డైరెక్టర్ ఆమెకు హీరోయిన్ అక్క క్యారెక్టర్ ను సజెస్ట్ చేస్తే  తప్పనిసరి పరిస్థితుల్లో పూజా హెగ్డే "అంతా మీ ఇష్టం సార్ అంటూ ఆ డైరెక్టర్ కు ఓకే చెప్పేసిందట.  కేవలం రెమ్యూనరేషన్ కోసమే పూజా హెగ్డే ఇంతలా దిగజారిపోయి తన ఏజ్ కన్నా ఎక్కువగా ఏజ్ కనిపించే పాత్రను ఓకే చేసింది అంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో పూజ హెగ్డే కు సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పూజ హెగ్డే పరిస్థితి రానున్న రోజుల్లో ఇంకా దిగజారిపోబోతుంది అని చెప్పడానికి ఈ రోల్ నిదర్శనం కాబోతుంది అంటున్నారు  జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: