గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి చాలామంది సెలబ్రిటీలు బయట పెట్టడం జరిగింది. ముఖ్యంగా దర్శక నిర్మాతలు కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు ఇస్తారని ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొత్తగా వచ్చే హీరోయిన్స్ సైతం ఆఫర్లు రావాలి అంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాలంటు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా నటి మౌనిషా చౌదరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను బయట పెట్టడం జరిగింది.


ఒకానొక సమయంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక స్టార్ డైరెక్టర్ తన దగ్గరికి వచ్చి మరి సినిమాలలో నటించమని తనని కోరారని తెలిపింది. తన సినిమాలో ఆఫర్ ఇస్తానని చెప్పిన కూడా తనకి మాత్రం నటించడం పెద్దగా ఇష్టం లేకపోయినా కూడా అతను మాత్రం వినకుండా నా వెంటపడి మరి తనని ఇబ్బంది పెట్టారంటూ తెలియజేసింది నటి మౌనిషా చౌదరి. ఒకరోజు ఏకంగా తన తొడల కొలతలను కూడా అడిగి మరి టార్చర్ చేశారంటూ తెలియజేసింది.


అయితే ఇప్పుడు మాత్రం ఆ డైరెక్టర్ బడా సెలబ్రిటీలతో పాన్ ఇండియా చిత్రాలను చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు అంటూ తెలియజేసింది. ఇందుకు సంబంధించిన ఒక పోస్ట్ షేర్ చేయగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారుతున్నది. కానీ నటి మౌనిషా మాత్రం ఆ డైరెక్టర్ పేరు తెలియజేయలేదు. దీంతో ఆ డైరెక్టర్ ఎవరో అంటూ పలువురు నేటిజెన్స్ సైతం తెగ వెతికేస్తూ ఉన్నారు. నిరంతరం సోషల్ మీడియాలో క్యాన్సర్ సంబంధించి అవగాహన కార్యక్రమాలను చేపడుతూ ఉంటుంది.


మౌనిక మాటలను బట్టి చూస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దర్శక నిర్మాతలు సెలబ్రిటీలను ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారా అనే విషయం ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ కూడా క్యాస్టింగ్ కావచ్చు గురించి వెల్లడిస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: