- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా కుబేర‌. ఈ సినిమా నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమాకు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల తో పాటు ట్రేడ్ వ‌ర్గాలు .. విశ్లేష‌కుల నుంచి యునాన‌మ‌స్ గా సూప‌ర్ పాజిటివ్ టాక్ అయితే వ‌చ్చేసింది. ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా ఇప్పుడు అదే స్థాయిలో ఉన్నాయి .. సినిమాకు ఏపీ , తెలంగా ణ‌లో మాత్ర‌మే కాకుండా ఓవ‌ర్సీస్ మార్కెట్ లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక ఓవ‌ర్సీస్ లో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలో ఉన్నాయి. ఈ సినిమా యూఎస్ మార్కెట్ డీసెంట్ ప్రీమియ‌ర్స్ రేంజ్ డే 1 నుంచి భారీ మార్జిన్ దిశ‌తో దూసుకు పోతోంది.


డే 1 అక్క‌డ ఏకంగా 8 ల‌క్షల గ్రాస్ మార్క్ ని క్రాస్ ఒక సెన్సేషనల్ వీకెండ్ పై కన్నేసింది. అంటే 1 మిలియన్ క్రాస్ చేయడానికి ఈ రోజు స‌రిపోతుంది. ఈ ఊపు చూస్తుంటే యూఎస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కుబేరు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే అమిగోస్ క్రియేషన్స్ -  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్లు సంయుక్తంగా రు. 150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: