సినిమా ఇండస్ట్రీ లో ఒక మూవీ వల్ల మరో మూవీ ఎఫెక్ట్ అయి ఆది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఇలా ఓ సినిమా విషయంలో జరిగినట్లు ఆ సినిమా నిర్మాతనే చెప్పుకొచ్చాడు. ఇంతకు ఆ సినిమా ఏది..? అలా చెప్పిన నిర్మాత ఎవరు..? అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత, శృతి హాసన్ హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రామయ్య వస్తావయ్య అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ రామయ్య వస్తావయ్య సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. 

ఆ తర్వాత మా బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరో గా ఓ సినిమా చేయాలి అనుకున్నాం. కథ మొత్తం రెడీ అయింది. కథ అందరికీ నచ్చింది. సినిమా స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ప్రభాస్ హీరో గా రూపొందిన రెబల్ మూవీ వచ్చింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మేము అనుకున్న కథ దాదాపు దాని దగ్గరగా ఉండడంతో దానితో అలాంటి కథతోనే మేము సినిమా చేస్తే ఆ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదేమో అనే భయంతో మేము ఆ కథను పక్కన పెట్టి కొత్త కథను తయారు చేసి రామయ్య వస్తావయ్య అనే టైటిల్ తో రూపొందించాం. ఆ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ సమయంలో మేము మొదట అనుకున్న కథతోనే ముందుకు వెళ్లి ఉంటే ఆ సినిమా మంచి విజయాన్ని అందుకునే వారమేమో అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: