
ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు ప్రభావం చూపడంతో షోలు రద్దు కావడం జరిగింది. హైదరాబాదు సహా పలు కీలక సెంటర్లలో కలెక్షన్స్ గణనీయంగా తగ్గిపోవడంతో, మొదటి వీకెండ్ ఫలితమే డిస్ట్రిబ్యూటర్ల భవితవ్యాన్ని నిర్ణయించబోతోందని అనిపిస్తోంది. ఓవర్సీస్‌లో మాత్రం ఓజీ సత్తా చాటుతోంది. కేవలం రెండు రోజుల్లోనే అమెరికాలో 4 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ద్వారా బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ కి ఉన్న గ్లోబల్ ఫ్యాన్‌బేస్, అద్భుతమైన ప్రీమియర్స్ కలెక్షన్స్ తో భారీ వసూళ్లు వచ్చాయి.
దర్శకుడు సుజీత్ స్టైలిష్ ప్రెజెంటేషన్, తమన్ అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్, అలాగే పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. యాక్షన్ సీన్స్, హీరో ఇంట్రడక్షన్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి, ఓజీ మొదటి రోజు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చినా రెండో రోజు కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన కలిగించింది. ఇప్పుడు వీకెండ్, దసరా సెలవులు ఈ సినిమాకు గేమ్‌చేంజర్‌గా మారతాయా అన్నది చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు