నితిన్ నటించిన తమ్ముడు సినిమా బిగ్ డిజాస్టర్ అయింది. తొలిరోజే ప్రేక్షకులు ఈ సినిమాకు మోహం చాటేసారు. ఇక ఈరోజు ఆదివారం బుక్ మై షో ఓపెన్ చేస్తే తమ్ముడు పరిస్థితి ఏంటో ఈజీగా అర్థమవుతుంది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే రెమ్యూనరేషన్ ఏంటి అన్నది ? పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సినిమాకు 75 కోట్ల రూపాయలు బడ్జెట్ అయిందని నిర్మాత దిల్ రాజు ఓపెన్ గా ప్రకటించారు. ఇటు చూస్తే నితిన్ వరుసగా ప్లాపుల మీద ప్లాపులు ఇస్తున్నాడు. నిర్మాత సమస్య అర్థం చేసుకున్న హీరో , దర్శకుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా హిట్ అయిన తర్వాత ఎంత ఇవ్వాలని అనిపిస్తే అంత ఇవ్వమని చెప్పారట ఇద్దరు. ఇటు హీరో నితిన్ కూడా అంకుల్ రెమ్యునరేషన్ మీరు ఎంత పంపించాలనుకుంటే అంత పంపించండి అన్నాడు. ఈ విషయం దిల్ రాజే స్వయంగా చెప్పారు.
అలా హీరో , దర్శకుడు పేమెంట్స్ ఇవ్వకుండానే నిర్మాత దిల్ రాజు తమ్ముడు సినిమాను రిలీజ్ చేశారు. సినిమా హిట్ అయితే హీరోలు , దర్శకులు రెమ్యూనరేషన్ పెంచుకుంటారని .. ప్లాపులు వస్తే మాత్రం నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ మాత్రమే నష్టపోతారని చెప్పిన దిల్ రాజు .. ఇప్పుడు తమ్ముడు సినిమాతో ప్లాప్ అందుకున్నారు. మరి ఇప్పుడు తమ్ముడు సినిమా డిజాస్టర్ కావడంతో హీరోకి , దర్శకుడు కి బ్యాలెన్స్ పేమెంట్ ఎంతవరకు ఇస్తారు ? అన్నది డౌట్ గానే ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు