ప్రేమ.. ప్రతి మనిషి జీవితంలోనూ ఓ అద్భుతం.. జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడకపోతే.. ఆ జీవితానికి అర్థమేలేదంటారు.. ఆ ప్రేమ మాధుర్యం తెలిసినవాళ్లు.. అయితే అన్ని ప్రేమకథలు సుఖాంతాలు కావు.. అన్ని ప్రేమ కథలూ విషాదాంతాలూ కావు.. అన్ని ప్రేమలు సక్సస్ కావు.


కళ్లు కళ్లు చూసుకుని చూపులు కలిసి ప్రేమలో పడ్డ ఎన్నో జంటల్లో కొన్నే ఆ కలల్ని నిజం చేసుకుంటున్నాయి. చాలావరకూ మధ్యలోనే ఆగిపోతున్నాయి. అందుకు ఎన్నోకారణాలు. కానీ తమ ప్రేమను నిజం చేసుకున్న జంటల వెనుక ఉన్న కష్టాల గాథలెన్నో.


కులం, మతం, ఆస్తులు, అంతస్తులు, బంధుత్వాలు, హోదాలు.. ఇలా ప్రేమకు అడ్డంకులెన్నో.. అలా ఎన్నో అడ్డంకులు దాటుకుని వచ్చిందే తీన్మార్ సావిత్రి ప్రేమకథ... ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఉన్న తీన్మార్ సావిత్రి ( శివజ్యోతి ) తన ప్రేమ కథ గురించి చెప్పి కన్నీరైంది.


ఇంతకీ శివజ్యోతి ప్రేమ కథ ఏంటంటే... ఆమె ఓ అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించిన ఆరు నెలలకే ఇంట్లో తెలిసింది. ఇంట్లోవాళ్లు ఆ అబ్బాయిని మరచిపొమ్మని చాలా టార్చర్ పెట్టారట. నీవు అతడికి దూరం కాకపోతే.. మేమే అతడిని చంపేస్తాం అని బెదిరించారట. అంతే కాదు.. సావిత్రిని తీవ్రంగా కొట్టారట. ఎంతగా అంటే.. ఒక్క నాలిక తప్ప.. శరీరంలో గాయం లేని భాగం లేదట.


అయినా ప్రేమను వదులుకోలేదట తీన్మార్ సావిత్రి.. మహా అయితే చంపేస్తారు అంతే కదా..అని మొండి ధైర్యంతో ప్రేమకోసం నిలబడిందట. ఆరు నెలలపాటు నరకం అనుభవించిందట. ఆరు నెలలపాటు కనీసం ప్రేమించిన అబ్బాయితో కూడా మాట్లాడలేదట. అంత నిజాయితీగా ఉన్నా ఇంట్లోవాళ్లు నమ్మకపోవడంతో ఇక ఆ ఇంట్లో ఉండటం వేస్టని ప్రేమించిన అబ్బాయి దగ్గరకు హైదరాబాద్ వచ్చేసిందట. ఇప్పుడు పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారట వాళ్లిద్దరూ.. అదీ తీన్మార్ సావిత్రి ప్రేమకథ.


మరింత సమాచారం తెలుసుకోండి: