నాని ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ను తన లేటెస్ట్ మూవీకి ఉపయోగించుకోవడం పై ఇప్పటికే అసహనంతో రగిలిపోతున్న మెగా అభిమానులు నిన్న నాని చేసిన ట్విట్ చూసి మరింత మండిపోతున్నారు. తన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ సెప్టెంబర్ 13న విడుదల కాబోతున్న విషయాన్ని తెలియ చేస్తూ తనకు సెప్టెంబర్ నెల సెంటిమెంట్ గా కలిసి వచ్చిన విషయాలను వివరించాడు.

నాని ‘అష్టాచెమ్మా’ ‘భలేభలే మగాడివోయ్’ మూవీలు సెప్టెంబర్ లో విడుదలై సూపర్ హిట్ అయిన పరిస్థితులలో అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నాని భావిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయమై మెగా అభిమానులకు ఆగ్రహం కలిగించి నానీ పై సెటైర్లు వేసే స్థాయికి తీసుకు వెళ్ళింది. 

సెప్టెంబర్ నెల మెగా హీరోలకు కలిసి వచ్చినంతగా ఇండస్ట్రీలో మరి ఏ హీరోకు కలిసి రాలేదు అని చెపుతూ సెప్టెంబర్ నెలలో గతంలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘అడవి దొంగ’ ఠాగూర్’ ‘అత్తారింటికి దారేది’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సెల్’ సినిమాలను ఉదాహరణగా చూపెడుతూ ఆసినిమాల స్థాయి విజయం నాని సినిమాలకు ఉందా అంటూ జోక్ చేస్తున్నారు. దీనికితోడు నాని మూవీ వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ తో పోటీగా విడుదల అవుతున్న పరిస్థితులలో మెగా హీరోల అభిమానుల నెగిటివ్ కామెంట్స్ మరింత స్థాయిలో నాని పై పెరిగి పోతున్నాయి. 

చిరంజీవి క్రేజీ మూవీ టైటిల్ తీసుకోవడమే కాకుండా ఇప్పుడు అనుకోకుండా ఏకంగా మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ సినిమాతో నానీ పోటీగా రావడంతో మెగా అభిమానుల అసహనం నానీ పై రోజురోజుకు విపరీతంగా పెరిగి పోతోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈ నెగిటివ్ కామెంట్స్ ను అదేవిధంగా మెగా అభిమానుల సహాయ నిరాకరణను తట్టుకుని ‘గ్యాంగ్ లీడర్’ నిలబడాలి అంటే ఆమూవీ పై టోటల్ పాజిటివ్ టాక్ రావాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: