రాధికా శరత్‌కుమార్ హీరోయిన్గా ఒకానొక సమయంలో ఒక వెలుగువెలిగింది. ఆ తర్వాత రాడాన్ మీడియా సంస్థను ప్రారంభించి బుల్లితెర టీవీ సీరియల్స్‌లోకి ప్రవేశించింది. ఆ సంస్థ నుండి ఎన్నో బిగ్ సీరియల్స్‌ని అందించింది. ఇక రాధిక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రాధికకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి. మూడవ భర్త శరత్‌కుమార్ అన్న విషయం అందరికీ తెలిసిందే. రాధిక మొదటి భర్త ప్రతాప్కె.పోతన్ మలయాళ నటుడిని వివాహం చేసుకుంది. కాని ఎక్కువ రోజులు ఈ బంధం నిలవలేదు. సంవత్సరానికే వీరు విడాకులు తీసుకుని వీరు విడిపోయారు.
అయితే వీరికి అప్పుడు పిల్లలు లేరు. ఇక 1990లో రిచర్డ్ హార్డే అనే బ్రిటీష్ దేశస్థుడిని ఈమె వివాహం చేసుకుంది. వీరిద్దరికి పుట్టిన సంతానమే రయానే హాజీ. కానీ వీరిద్దరి బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. ఆయనతో కూడా విడాకులు తీసుకుని విడిపోయింది రాధిక. ప్రస్తుతం రిచర్డ్ హార్డే లేరు మరణించారు. రాధిక మళ్ళీ 2001లో శరత్‌కుమార్‌ని పెళ్ళి చేసుకుంది. వీరిద్దరికి రాహుల్ అనే కొడుకు ఉన్నాడు.
ఇక శరత్‌కుమార్ మొదటి భార్య శారదాదేవి. ఆమెకు వారిద్దరికి పుట్టిన సంతానమే శరత్ కుమార్ వరలక్ష్మి. ప్రస్తుతం తమిళనాట ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం రేయాన్ రాధిక, శరత్‌కుమార్, అలాగే వరలక్ష్మి అందరూ కూడా హ్యాపీగా కలిసి ఉంటారు. అందరూ ఒకరి పై ఒకరు ప్రేమలు కురిపించుకుంటారు. ఈ ప్రఖ్యాత జంటకు విజయం సులువుగా వరిస్తుంటుంది . నటనలో సాటిలేని రాధిక ప్రశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సృష్టించుకున్నారు . శరత్ కుమార్ తన ఆకర్షణీయమైన ఫిజిక్ , చరిష్మాలతో అందరికీ అభిమానపాత్రుడయ్యారు . వీరిద్దరుకీ ముందే పెళ్లిల్లు అయినా మనసులు ఒకటై ఒకే రకమైన ఆసక్తులు ఉన్నందున వివాహము చేసుకున్నారు .రాధిక రాడాన్ మీడియా వెనక ఉంటే, శరత్ నటన ... రాజకీయాల్లో ముందున్నారు .