5జీ నెట్వర్క్ ను తెరమీదికి తీసుకొచ్చి ప్రపంచ వ్యాప్తంగా తమ 5జీ నెట్వర్క్ విస్తరింప చేయాలని చైనా  ఎంతో ప్రయత్నించినప్పటికీ భారత్ ముందుగానే గమనించి చైనా 5జీ నెట్వర్క్ కు  బ్రేక్ వేయడంతో అటు ప్రపంచ దేశాలు కూడా ఇక  భారత్ తరహాలోనే 5జీ నెట్వర్క్ ను బహిష్కరించాయి అనే విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే భారత్లో ఫైవ్ జి సేవలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.  ఇప్పటికే టెక్నాలజీ రంగంలో వినూత్న పోకడలను అవలంబిస్తున్న భారత ప్రభుత్వం ఇప్పుడు 5జీ సేవల విషయంలో కూడా అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవాలి అని అనుకుంటుంది.




ఈ క్రమంలోనే ప్రస్తుతం 5జీ సేవలకు సంబంధించి కీలకమైనటువంటి ప్రక్రియ మొదలు పెట్టింది భారత ప్రభుత్వం. అయితే అయితే 5g సేవలకు సంబంధించి పూర్తిగా ప్రణాళికను ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసి 2022 జనవరిలో 5g సేవలు  ప్రారంభించాలి అని భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీని కోసం కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 5జీ సేవల కోసం భారతదేశాన్ని సిద్ధం చేయాలి అని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.



 మరోవైపు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ హోంశాఖ నుంచి కూడా 5g సేవలకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభించడానికి క్లియరెన్స్ కూడా దక్కినట్లు తెలుస్తోంది. అయితే 5జీ సేవల విషయంలో విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం పేర్లకి మాత్రమే అంకె  పెరుగుతుందని కానీ నెట్వర్క్ పరంగా మాత్రం రోజురోజుకీ క్వాలిటీ తగ్గుతుంది అంటూ అంటున్నారు. మొదట్లో 4జీ  తెర మీదికి వచ్చిన సమయంలో బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం 2జి,3జి స్పీడు లో మాత్రమే 4జీ ఇంటర్నెట్ వస్తుందని ఇక ఇప్పుడు 5g తీసుకొచ్చిన కూడా ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అందుకే ముందుగా కేంద్ర ప్రభుత్వం సర్వీస్ ప్రొవైడర్ లపై దృష్టి పెట్టాలి అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: