కరోనా ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది.. మన ఇండియానే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇదే పరిస్థితి.. ఇంకా ఈ ముప్పు తొలగిపోలేదు కూడా.. కాస్త ప్రస్తుతం కరోనా మహమ్మారి తన ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా అప్పుడే మనం సేఫ్ అనుకోవడానికి లేదు. థర్డ్ వేవ్ ముప్పు గురించి నిపుణులు హెచ్చరించినా.. ఆ జాడలేమీ కనిపించడం లేదు. అయితే.. కరోనా ప్రస్తుతానికి తగ్గినా దేశాలన్నీ ఆర్థికంగా మాత్రం సంక్షోభంలో ఉన్నాయి. అయితే.. మరి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేదెలా..?


కరోనా సంక్షోభంతో ప్రజల చేతుల్లో డబ్బు లేదు.. వ్యాపారాలు డీలా పడ్డాయి. వారిని ఆదుకుందామంటే ప్రభుత్వాల దగ్గర కూడా అంత సొమ్ము లేదు. ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ప్రజలపై పన్నులు వేయాలి.. ప్రస్తుతం ప్రజలు కూడా పన్నులు చెల్లించే పరిస్థితుల్లో లేరు. కాదని మొండిగా పన్నులు వేస్తే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది.. అందుకే ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మరి ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేది ఎలా.. ఇప్పుడు ఆర్థిక వేత్తల ముందున్న సవాల్ ఇది. దీనికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజు సాధించిన భారత మూలాలున్న ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీఐడియా చెబుతున్నారు.


ఈ పరిస్థితుల్లో ప్రజలపై పన్నుల భారం వేయకుండా సింపుల్‌గా బయటపడొచ్చంటున్నారు. అదేంటో తెలుసా.. సింపుల్‌గా కొత్త నోట్లను ముద్రించడమేనట. అవును.. ఇదే సరైన మార్గమని నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం కరోనా సమయంలోనూ కొన్ని వస్తువులపై పన్నులు పెంచింది. ప్రత్యేకించి పెట్రో ధరలను క్రమంగా పెంచుతోంది. ఈ విషయం ఆయన వద్ద ప్రస్తావిస్తే.. కేంద్రం పదేపదే సెస్సులు పెంచడం సరికాదన్నారు. ఇందుకు కొత్త నోట్లు ముద్రించడమే సరైన పరిష్కారం అంటున్నారు అభిజిత్ బెనర్జీ.


కేంద్రం బడ్జెట్‌ లోటును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని.. కానీ  ఇది విరివిగా ఖర్చు చేయాల్సిన సమయమని గుర్తు చేస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలు కూడా ఇలా కొత్తగా నోట్లు ముద్రిస్తున్నాయంటున్నారు. నోట్లు ముద్రించి ఖర్చు చేయడంతో ప్రజల ఉపాధి పెరుగుతుందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: