ఇవాళ ప్రగతి భవన్ లో పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించే సూచనలు కనపడుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత జరిగే సమీక్షలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులతో సమీక్ష నిర్వహించారు సిఎం కేసీఆర్. నిన్న యాసంగి పంటల ప్రణాళికపై సమావేశం నిర్వహించిన మంత్రి నిరంజన్ రెడ్డి... ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలి ? ఏంటీ అనేది సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగం ? అనేది మంత్రి చర్చించారు.

మార్కెట్‌లో పంటల డిమాండ్ ఎలా ఉంది ? అని ప్రశ్నించారు అధికారులను. పరిగణలోకి డిమాండ్ ను బట్టి మార్కెటింగ్ రీసెర్చ్ & అనాలసిస్ వింగ్ సూచనలు సలహాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్  వద్దకు తుది నివేదిక అందజేయనున్న వ్యవసాయ శాఖ... యాసంగి పంటల ప్రణాళికను ఖరారు  చేసే అవకాశం ఉంది. ఈ సారి  ఇతర పంటలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.  రాబోయే సీజన్లలో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల వరి వ్యవసాయాన్ని తగ్గించాలని ప్రభుత్వం యోచనలో ఉందని తెలుస్తుంది.

 క్లస్టర్ వ్యూహాన్ని అనుసరించనున్న ప్రభుత్వం...   ఐదు ప్రత్యామ్నాయ పంటలైన పచ్చిశనగ, వేరుశనగ...  పొద్దుతిరుగుడు, నువ్వులు, బెంగాల్ గ్రామ్‌లపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. కొత్త పంటల సరళిపై రైతులను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ  చేసింది. మరికొన్ని రోజులు  రైతులతో కమ్యూనికేట్ చేయనున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. రాబోయే సీజన్లలో వరి సాగును క్రమంగా 20% తగ్గించడం ప్రణాళికగా పెట్టుకున్నారని తెలుస్తుంది.  ప్రత్యామ్నాయ పంటలతో ముందుకు సాగడానికి మూడు జోన్లుగా గుర్తించారు.  "33 జిల్లాలలో లక్షణాల ఆధారంగా అవి మూడు జోన్లుగా వర్గీకరించనున్న అధికారులు... 2020-21 వాన కాలంలో 48.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది అని మంత్రికి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr