చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. తాజాగా ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో చైనా లిబరేషన్ ఆర్మీకి చెందిన సైన్యం... పర్యటించడం, వంతెన పేల్చివేయడం, గుర్రాలతో కవాతు నిర్వహించడం... వంటి చర్యలతో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని అంతా భయపడుతున్నారు. ఇన్ని వివాదాల మధ్య... తాజాగా చైనా సైన్యంలో పాకిస్తాన్ అధికారులకు చోటు కల్పించడం... పశ్చిమ కమాండ్ ప్రాంతంలో గస్తీ నిర్వహించడం కూడా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఓ వైపు ఇరు దేశాల చర్చల సమయంలో బలగాల ఉపసంహరణ అంటూ మాటలు చెబుతున్న డ్రాగన్ కంట్రీ... సరిహద్దు గ్రామాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయడం... బోర్డర్ వరకు హై స్పీడ్ రైలు ట్రాకులు ఏర్పాటు చేయడం చూస్తుంటే... డ్రాగన్ ఏదో కుట్ర పన్నుతున్నట్లే తెలుస్తోంది. తూర్పు లడఖ్ ప్రాంతంలో రోజు రోజుకూ మారుతున్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించింది భారత ప్రభుత్వం.

బోర్డర్‌లో పరిస్థితులపై నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో... భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే సడన్ విజిట్ ప్లాన్ చేశారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో రెండు రోజలు పాటు ఆర్మీ చీఫ్ నరవణే పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా సైనికాధికారులు, లడఖ్ ఉన్నతాధికారులతో కూడా ఎంఎం నరవణే సమీక్ష నిర్వహించారు. డ్రాగన్ కంట్రీ పరిస్థితులు, తాజా పరిస్థితులపై చర్చించారు ఆర్మీ చీఫ్. ప్రస్తుతం శీతాకాలం కావడంతో... మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉంటుంది. దీంతో నిఘాను మరింత పెంచాలని కూడా నరవణే సూచించారు. మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించారు. సరిహద్దుల వరకు బలగాలను వేగంగా తరలించేందుకు ఇప్పటికే చైనా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తోందని ఆర్మీ చీఫ్ నరవణే హెచ్చరించారు. చైనాకు ధీటుగా బదులిచ్చేందుకు భార్ సిద్ధంగా ఉందని.. అత్యాధునిక ఆయుధాలను సరిహద్దుల్లో మోహరిస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే... సమగ్రంగా తిప్పికొట్టేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు నరవణే. అదే సమయంలో సమస్య పరిష్కారం కోసం పొరుగు దేశంతో కమాండర్ స్థాయి అధికారులతో చర్చలు జరిపేందుకు మరోసారి ప్రయత్నిస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: