జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కేవలం పది రోజుల క్రితమే ఆ పదవిని అలంకరించారు. అయినా పదవి కోసం ప్రాకులాడకుండా, తన దేశ నేతలు ప్రజల చేత ఎన్నుకోబడాలనే ఉద్దేశ్యంతో లోక్సభ ను రద్దు చేశాడు. దీనికి ఆ సభ సభ్యులు కూడా పూర్తిగా ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ సభలో మొత్తం 465 సభ్యులు ఉన్నారు. వారందరు ఏక కంఠంతో ఈ రద్దును స్వాగతించారు. తమ సభ రద్దు  అయినట్టుగా ఆ సభ స్పీకర్ తడమొరి ఓషిమా ధ్రువీకరించారు. జపాన్ ప్రధాని ఈ విధమైన నిర్ణయానికి ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురైనప్పటికీ, కిషిడా మాత్రం సమర్ధించుకున్నారు.

కిషిడా మాట్లాడుతూ, తమ పాలనకు ప్రజల మద్దతు ఉండాలని అందుకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము అన్నారు. ఈ నిర్ణయంతో జపాన్ లో ఈ నెల 31 న సార్వత్రిక ఎన్నిక జరగనుంది. ఆ దేశంలో 2017లో లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కన్జర్వేటివ్ లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అత్యధిక మెజారిటీ తో గెలవడంతో షింజో ప్రధాని అయ్యారు. ఆయన 2020 ఆగష్టు 28న అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుండి వైదొలిగారు. అనంతరం యోషిహైజ్ సుగా నూతన ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ లో ఆయన అనేక విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది. అలాగే కరోనా సమయంలో సరైన ఆర్థిక విధానాలు అమలు చేయలేకపోవడం లాంటివి ఆయనను పదవి నుండి తప్పుకునేట్టు చేసింది.  దానితో అధికార పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించి కిషిడా ను నూతన ప్రధానిగా ఎన్నుకున్నారు.

నూతన ప్రధానిగా కిషిడా పది రోజులు కూడా పదవిలో కొనసాగకముందే దిగువ సభను(లోక్సభ) రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధానిగా మిగిలిపోయారు. ఆయన ప్రజా మద్దతు అంటూ ఈ రద్దు చేసినట్టు చెపుతున్నారు. అందుకే మరోసారి జపాన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో ఆయా పార్టీల బలాబలాలు తేలాలి, అప్పుడు వారు ప్రధానిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు దేశంలో రాష్ట్రపతి పాలనా లేక కిషిడా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: