లఖింపూర్ పై జస్టిస్ రమణ ఏమన్నారు ?

ఈ నెల ఆరంభంలో భారత దేశాన్ని ఒక కుదుపు కుదిపిన లఖింపుర్ ఖేరీ కేసులో సుప్రీం కోర్టు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 3న జరిగి అల్లర్లకు సంబంధించి  తాజా నివేదికను అక్టోబర్ 27 న కోర్టుకు సమర్పించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ  ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని అదేశించారు. లఖింపుర్ ఘటనలో పది మంది నిందితులను అరెస్టు చేసి, వారిని  విచారణ చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒక అఫిడవిట్ ను సుప్రీం కోర్టుకు దాఖలు చేసింది. జస్టిస్ రమణ నేతృత్వం లోని ధర్మాసం సదరు అఫిడవిట్ ను పరిశీలించింది. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని న్యాయస్థానం పేర్కోంది. కేసు విచారణ చాలా నింపాదిగ జరుగుతున్నట్లు తెలుస్తోందని, ఈ పద్దతి సరికాదని వ్యాఖ్యానించింది. మీ పని తీరు సరిగా లేదని అఫిడవిట్ ను బట్టి తేలుస్తోదని తెలిపింది. ఇది అంతు లేని కథ కాదు, ముగిసి న అధ్యాయం గా చూడవద్దని పోలీసులకు హితవు పలికింది. నలభై నాలుగు మంది ప్రత్యక్ష సాక్షుల్లో నాలుగురి వాగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామని ఉత్త ర ప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిని సమర్థించని న్యాయ స్థానం మిగిన సాక్షుల కథనాలను కూడా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలని అదేశించింది.

వాస్తవానికి సుప్రీం కోర్టు అక్టోబర్ 8 నే ఉత్తర ప్రదేశ ప్రభుత్వంపైనా, అక్కడి పోలీసుల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. లఖింపూర్ ఖేరి ఘటనలో ఎనిమిది రైతులుఅశువులు బాసారు,. భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర  హోం శాఖ సహాయ మంత్రి అశిష్ మిశ్రా కుమారుడు  అజయ్ కుమార్ మిశ్రా తో పాటు మరో పది మంది నిందితులు.  రైతుల ర్యాలీ పై మంత్రి కుమారుడు తన కారును దూకిించడంతో ఎనిమిది మంది కర్షకులు మృతి చెందారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయంగా వేడిని రగిలించింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వద్రతో సహా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ ఘటన పై  భారత సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసింది. తాజాగా సుప్రీం కోర్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పైనా,అక్కడి పోలీసుల పనితీరు పైనా అసంతృప్తి ని వ్యక్తం చేసింది.




మరింత సమాచారం తెలుసుకోండి: