ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికతో తెలంగాణలో  గత మూడు నెలల నుంచి రాజకీయమంతా ఆ నియోజకవర్గం చుట్టే తిరిగింది. నిన్నటితో బిజెపి విజయం సాధించడంతో కథ సుఖాంతమైంది. కానీ మళ్లీ తెలంగాణలో  మరో ఉప ఎన్నిక అనేది  రాబోతుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే హుజురాబాద్ మరియు దుబ్బాక స్థానాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా, నాగార్జునసాగర్ హుజూర్నగర్ లో తెరాస విజయం సాధించింది. తెరాస యొక్క సిట్టింగ్ స్థానం అయినటువంటి  దుబ్బాక ను తన ఖాతాలో వేసుకున్న టువంటి బిజెపి  మళ్లీ హుజురాబాద్ లో కూడా విజయం సాధించి కేసీఆర్ కు సవాల్ విసురుతోంది.

ఈ సందర్భంలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక కూడా రాబోతుందా.. అనే చర్చ జోరుగా సాగుతోంది. త్వరలోనే మళ్లీ ఉప ఎన్నిక రాబోతుందని బిజెపి ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. అయితే 2018 సంవత్సరం నుంచి తెరాస రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణలో ఇప్పటికి నాలుగు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక, అలాగే రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక, నోముల నర్సింహయ్య మృతితో నాగార్జునసాగర్, మరియు  ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక స్థానాలకు  ఇప్పటివరకు ఎన్నికలు  జరిగాయి. ఉప ఎన్నికల్లో దుబ్బాక మరియు హుజురాబాద్ స్థానాల్లో బిజెపి పార్టీ కైవసం చేసుకోగా, నాగార్జునసాగర్ హుజూర్ నగర్ లో, తెరాస విజయం సాధించింది. తెరాస యొక్క సిట్టింగ్ స్థానం అయినటువంటి దుబ్బాక వారి ఖాతాలో వేసుకున్నటువంటి బిజెపి ప్రస్తుతం హుజురాబాద్ లో కూడా విజయ ఢంకా మోగించింది. హుజురాబాద్ ఉప ఎన్నిక విజయంతో బిజెపి పార్టీలో మరింత ఊపు వచ్చింది. దీంతో ఆ పార్టీ నాయకులు గులాబీ బాస్ కు సవాల్ విసురుతున్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక జరగబోతోందని జోరుగా చర్చ సాగుతోంది. తెరాస ఎమ్మెల్యే అయినా  చెన్నమనేని రమేష్ స్థానమైన వేములవాడ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉన్నదని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ జోస్యం చెప్పేశారు. అయితే చెన్నమనేని రమేష్ పౌరసత్వం పైన కోర్టులో కేసు కొనసాగుతూ వస్తోంది.

ఇందులో రమేష్ కు  వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లయితే  అక్కడ మరో ఉప ఎన్నిక లంచనమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  ఓ టీవీ ఛానల్లో చెప్పారని తెలుస్తోంది. అయితే ఆ వచ్చే ఎన్నికల్లో కూడా బిజెపి  తప్పకుండా గెలుస్తుందని ఆయన అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈటల రాజేందర్ గెలుపు బీజేపీకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అని, ప్రస్తుతం ఐదుగురు తెరాస ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: