మానవహక్కులపై పెద్ద ఎత్తున ప్రచారం చేసే కమ్యూనిస్టు పార్టీలు అవన్నీ చెప్పడం తప్ప చేసేది ఏమి ఉండటం లేదు. ముఖ్యంగా అలాంటివి బాగా ప్రోత్సహిస్తూ వస్తున్నా చైనా కు ఇది బాగా వర్తిస్తుంది. గతంలో ప్రపంచం చైనా వైపు చూసింది కాబట్టి, బాగా అభివృద్ధిలో ముందున్న చైనా తన తరహా ప్రభుత్వాలు లేదా కమ్యూనిస్టు ప్రభుత్వాలను ఏర్పాటుకు ప్రోత్సహిస్తూ వచ్చింది. అసలు ఇలాంటి పార్టీల ప్రధాన ఉద్దేశ్యం కేవలం మానవహక్కుల ను కాపాడటం. కానీ చైనా లో అలాంటివి ఏమి కనిపించవు. ఎవరూ నోరెత్తి ప్రభుత్వానికి ఎదురు చెప్పకూడదు, ఓటు వేయకూడదు ఇలా చెప్పుకుంటూ పోతే మానవహక్కులు అనేవి అసలు కనిపించని దేశంగా చైనా ఉందని అర్ధం అయిపోతుంది. అటువంటి దేశం లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉందని ఊహించుకోవడం తప్ప అక్కడ అసలు మానవ హక్కులకు విలువ లేనేలేదు.

కేవలం నియంత పాలన, అదికూడా ప్రజలు కేవలం బానిసలు, అధినేత వేసిన బిక్ష తిని బ్రతకాలి, లేదా చెప్పింది చేయాలి తప్ప మరొకటి ఉండబోదు. ఇలాంటి ప్రభుత్వం ఉన్న దేశం ప్రచారం చేసే కమ్యూనిజం ఎంత గొప్పగా ఉండనుండో ఇప్పటికే మనం మయన్మార్, సుడాన్, ఆఫ్ఘన్ లాంటి దేశాలలో చూస్తూనే ఉన్నాం. అధ్యక్షుడిని ఎన్నుకొనే హక్కు కూడా ప్రజలకు లేదు, కేవలం పార్టీ మాత్రమే ఎన్నుకుంటుంది. టిబెట్, మంగోలియా లాంటి ఎన్నో ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుంది చైనా, అక్కడ వారి సంస్కృతి సాంప్రదాయాలను  కాలరాస్తూ, వారి హక్కులకు విలువ ఇవ్వకుండా ఇష్టానికి ప్రవర్తించడం ఎటువంటి కమ్యూనిస్టు పార్టీ కిందకు వస్తుందో మరి చైనా నే చెప్పాలి.

హాంగ్ కాంగ్ లో కూడా చైనా ఇదేతరహా అరాచకం చేసుకుంటూ వచ్చిన విషయం కూడా చూశాం. ఆయా ప్రాంతాలలో చైనా అధ్యక్షుడు చెప్పినట్టు నియమాలు ఆచరించాలి తప్ప మరొక స్వేచ్ఛ ఉండరాదు. జింజియన్ ప్రావిన్స్ లో కూడా ఇదే తరహా ఆగడాలు చేస్తూ వచ్చింది చైనా. తాజాగా అక్కడ జరగాల్సిన వింటర్ ఒలింపిక్స్ వచ్చే ఏడాది జరగాల్సి ఉండగా వాటిని కూడా అడ్డుకుంటుంది చైనా. అది కేవలం మతపరమైన ప్రాంతమని, అక్కడ నిర్వహించ దలచిన క్రీడలను అన్ని దేశాలు నిషేధించాలి అని చెప్తూ 112 సంఘాలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. కమ్యూనిస్టులు మానవహక్కులను గురించి మాట్లాడేవారు ఈ ఉద్యమాల గురించి మాట్లాడలేకపోతుండటం విచిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: