నరేంద్ర మోడీ ప్రభుత్వం  గద్దెనెక్కిన అప్పటి నుంచి ప్రజలకు వ్యతిరేకంగా అనేక చట్టాలు తీసుకు వస్తున్నారని, అలాగే పెరిగినటువంటి ధరలతో  పేద ప్రజలు అనేక  ఇబ్బందులు  పడుతున్నారని , వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చి మళ్లీ రద్దు చేయడం ఇలా అనేక ప్రజలకు ఆమోదయోగ్యం కాని విధానాల వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని అందుకోసం, 
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతు న్నoదున దేశవ్యాప్తంగా వ్యతిరేక పోరాటాన్ని నిర్వహించడానికి గాను కార్మిక కర్షక సంఘాలు ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది. ఈనెల 1వ తేదీన ఢిల్లీలో జరిగిన కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక సదస్సులో దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చర్చించి భవిష్యత్ కార్యాచరణకు, పోరాటానికి సిద్ధం కావాలనిఇచ్చిన పిలుపును దేశప్రజలు స్వాగతించాలి.

ప్రస్తుత కార్యాచరణ నేపథ్యం:
 
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని ఆలోచింప చేయడం కోసం గత సంవత్సరం నవంబర్ 26వ తేదీన దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించుకున్న విషయం మనకందరికీ తెలిసినదే. కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రధానంగా ఏడు డిమాండ్ల పరిష్కారం కోసం గత సంవత్సరం సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. కార్మిక ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిన లేబర్ కోడ్ రద్దు చేయాలని, ప్రైవేటీకరణ, దేశ సంపదను అమ్మడాన్ని విరమించుకోవాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద వంద రోజులకు బదులుగా 200 రోజులు గా ఉపాధిని పెంచాలని పట్టణ ప్రాంతాలకు కూడ  విస్తరించాలనేవి ప్రధాన డిమాండ్లు. గత సంవత్సరం పెట్టిన ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పరిష్కరించక పోగా తాత్సారం చేస్తున్నందున దానికి నిరసనగా 2021 నవంబర్ 26వ తేదీన" సార్వత్రిక సమ్మె వార్షికోత్సవాన్ని" దేశవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపు నివ్వడం జరిగింది. కార్మిక సంఘాలతో పాటు కర్షక సంఘాల సమావేశం కూడా ఐక్య ఉద్యమాలకు ఆమోదం తెలపడంతో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి నట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: