గత కొన్ని రోజుల నుంచి ఇండియా లో పెట్రోల్ బాదుడు ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి  చితికిపోయిన సామాన్యుడి జీవితం పై గుదిబండలా పడిపోయింది పెట్రోల్ ధర. ఇప్పటికే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి లో ఉన్న సామాన్యుడిని మరింత ఆర్థిక సమస్యల్లోకి నెట్టింది పెట్రోల్ ధర. అంతకంతకూ పెరుగుతూ ఏకంగా సెంచరీ దాటిపోయింది. సెంచరీ దాటిన తర్వాత కూడా పెట్రోల్ బాదుడు ఎక్కడా ఆగలేదు. ఏకంగా 115 రూపాయలకు చేరుకుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కాస్త టాక్స్ తగ్గించడంతో చివరికి ప్రస్తుతం నూట పది రూపాయల వద్ద కొనసాగుతోంది పెట్రోల్ ధర.


 ఇక ఈ పెట్రోల్ ధర టు సామాన్యులకు భారంగా నే మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరగడం తో ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి పెట్రోల్ ధర కూడా పెరగడంతో వాహనం బయటకు తీయాలి అంటేనే భయపడిపోతున్నారు. పెట్రోల్ ధరను తగ్గించండి అంటూ ఎవరైనా నిరసన తెలిపితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప సామాన్యుడిపై భారం తగ్గించేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. అయితే మన దేశంలో సెంచరీ దాటి ఇంకా హై స్పీడ్ తో దూసుకుపోతున్న పెట్రోల్ ధర కొన్ని దేశాలలో మాత్రంఊహించనంత ధరకు లభిస్తూ ఉండటం గమనార్హం.



 ఇక కొన్ని దేశాలలో పెట్రోల్ ధర లీటర్ కు ఎంత ఉందో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు అని చెప్పాలి. వెనిజులాలో లీటర్ పెట్రోల్ కేవలం రూ 1.88 మాత్రమే సిరియాలో రూపాయలు 4.50 మాత్రమే..అంగోలా లో రూ 20.57 మాత్రమే. ఇలా ఇంత తక్కువ ధరకు వివిధ దేశాలలో పెట్రోల్ లభిస్తోంది. చైనా, పాకిస్థాన్, యూఏఈ,బంగ్లాదేశ్, భూటాన్ లో కూడా పెట్రోల్ ధరలు తక్కువగానే ఉన్నాయి. కానీ భారత్లో మాత్రం 110 రూపాయలు వద్ద కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక సుంకం విధించడం కారణంగానే ఇక పెట్రోల్ ఇంత ధర పలుకుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: