
ఒకసారి కాదు, అనేక సార్లు గెలిచారు. ఇక ఎక్కడో ఉత్తరాంధ్రాలోని టెక్కలిలో కూడా అన్న గారు పోటీ చేస్తే జనాలు గెలిపించారు. అలాగే హిందూపురంలో గెలిచారు. తిరుపతిలో సైతం గెలిచారు. గుడివాడలో గెలిచారు. అది ఎటూ ఆయన సొంత ప్రాంతమే అనుకోండి. మొత్తం మీద చూసుకుంటే ఎన్టీయార్ పట్ల కనబరచిన అభిమానానికి విశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకోవాలి.
మరి చంద్రబాబు విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది అంటే బాబును కూడా ఆరు సార్లు జనాలు ఆదరించారు. ఆయన కూడా మరో చోటు చూసుకోకుండా కుప్పం లోనే పోటీ చేస్తూ గెలిచారు. ఆలా ప్రతిపక్ష నేతగా సీఎం గా ఆయన ఎన్నో సార్లు పనిచేశారు.
మరి ఇపుడే కుప్పం ఎందుకు ఆయన పట్ల అలా వ్యవహరిస్తోంది. లోకల్ బాడీస్ జరిగిన ఎన్నికల్లో ఎందుకు టీడీపీ ఓడింది. సమీక్షలో బాబు తాను అక్కడ ఇల్లు కట్టుకుంటాను అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని వెనక చాలా కధ ఉంది. బాబు కుప్పం లో పెద్దగా గతంలో పర్యటించలేదు అన్నది నిజం.
అయితే 2019 తరువాత సీన్ మారింది. దాంతో ఆయన వెళ్లాల్సి వస్తోంది. అదే విధంగా ఆయన ఇంచార్జిగా నియమించిన వారు సరిగ్గా పనిచేయకపోవడం కూడా బాబు ఖాతాలోకే వెళ్ళింది. బాబు తాను సీఎం గా ఉన్నపుడు కుప్పం పంచాయతీని మునిసిపాలిటీగా చేసి ఉన్నా ఎంతో కొంత బాగుండేది. ఏది ఏమైనా కుప్పం ప్రజలు తన ఎమ్మెల్యే తమ వద్ద ఇల్లు కట్టుకోవాలని కోరుకోవడంలేదు, వారు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు అనే అర్ధం చేసుకోవాలి.