నెక్స్ట్ ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తే..పార్టీ పరిస్తితి ఏంటి? అంటే అబ్బో కష్టమే...సగం కూడా గెలవరేమో అని డౌట్ సొంత పార్టీ నేతలకే రావొచ్చు. ఎంత జగన్ గాలి ఉన్నా సరే...మళ్ళీ అందరూ గెలవడం అనేది కలే అని చెప్పాలి. అంటే చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టంగా కనబడుతోంది. ఇక అలాంటి ఎమ్మెల్యేలని పక్కనబెట్టకపోతే వైసీపీకి డ్యామేజ్ జరగడం ఖాయం. ఆ విషయం జగన్‌కు తెలుసనే చెప్పాలి.

అందుకే ఇప్పటినుంచే ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నట్లు కథనాలు కూడా వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీంని పెట్టుకుని ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలు సర్వేల్లో వైసీపీలో దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని తెలిసింది. ఇక వారిని జగన్ ఇమేజ్ కూడా కాపాడలేదని తెలుస్తోంది. అలాంటి ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇస్తే గెలవడం కష్టమని అర్ధమైపోతుంది. అందుకే అలాంటి ఎమ్మెల్యేలకు జగన్ ఈ సారి హ్యాండ్ ఇచ్చి...కొత్తవారికి సీట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలని మార్చాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. గుంటూరులో పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత వచ్చిందని అర్ధమవుతుంది. పైగా రాజధాని అమరావతి ప్రభావం బాగా ఉంది. ఈ పరిణామాలని బేరీజు వేసుకుని చూసుకుంటే గుంటూరులో కొంతమంది ఎమ్మెల్యేలని పక్కనబెట్టడం ఖాయమని మాత్రం తెలుస్తోంది.

ముఖ్యంగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సీటు బాగా డౌట్ అని చెప్పొచ్చు. అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గంలో శ్రీదేవిపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీటు కూడా డౌట్ అనే టాక్. అలాగే పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సీట్లు విషయంలో కూడా క్లారిటీ లేదని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: