మోడీ సర్కార్‌ ను కేంద్రంలో ఎలాగైనా పడగొట్టాలని కేసీఆర్‌ ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. మోడీ సర్కార్‌ కు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను తాను కలుపుకుపోతానని చాలా సార్లు చెప్పారు ఇందులో భాగంగానే..  సిపిఐ, సిపిఎం పార్టీల జాతీయ అగ్రనాయకత్వం శనివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభమై  మూడు రోజుల పాటు జరుగునున్న కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సిపిఎం పార్టీ జాతీయ నేతలు హైద్రాబాద్ కు రాగా... సిపిఐ పార్టీ అనుబంధ అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు సిపిఐ నేతలు వచ్చారు. 

 రాజకీయాలు,  తెలంగాణ స్టేట్  అభివృద్ధి.,తదితర అంశాల పై సిఎం కెసిఆర్ తో చర్చించారు.  ఈ సందర్భం గా సమావేశం లో... సిపిఎం అగ్ర నేతలు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్., త్రిపుర మాజీ సిఎం మాణిక్ సర్కార్, సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు రామ చంద్రన్ పిల్లై , బాల కృష్ణన్, ఎం ఎ బేబీ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ జాతీయ నేతలు...సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ పార్ల మెంటరీ పార్టీ పక్షనేత, కేరళ ఎంపీ బినయ్ విశ్వం, కేరళ రెవిన్యూ శాఖ మంత్రి రాజన్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి,  మాజీ ఎంపీ ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జె. సంతోష్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి  శ్రవణ్ కుమార్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: