
అయితే ఆ మధ్య టిపిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి రావడంతో బీజేపీ హవా కాస్త తగ్గింది..అప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు పోరు నడిచింది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చి, హుజూరాబాద్ ఉపఎన్నికలో మళ్ళీ గెలవడంతో రాజకీయం పూర్తిగా మారిపోయింది...మళ్ళీ బీజేపీ రేసులోకి వచ్చింది..పైగా బండి సంజయ్ దూకుడుగా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేయడం బీజేపీకి కలిసొచ్చింది...దీంతో కాంగ్రెస్ రేసులో వెనుకబండింది.
కాంగ్రెస్‌ని పైకి లేపడానికి రేవంత్ రెడ్డి తీవ్రంగానే ప్రయత్నిస్తూనే వచ్చారు...కానీ ఎక్కడా కూడా అవకాశం దొరకలేదు...తాజాగా మాత్రం మోదీ వ్యాఖ్యల రూపంలో అటు టీఆర్ఎస్‌కు, ఇటు కాంగ్రెస్‌కు మంచి అవకాశం దొరికింది. మోదీ పార్లమెంట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదని, కాంగ్రెస్ అన్యాయం చేసిందని మాట్లాడిన విషయం తెలిసిందే. ఇక దీనిపై టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు బీజేపీని టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్నాయి. మోదీ తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారని టీఆర్ఎస్ శ్రేణులు మళ్ళీ సెంటిమెంట్ లేపుతున్నాయి.
ఇటు రేవంత్ రెడ్డి సైతం...బీజేపీని టార్గెట్ చేసి, తెలంగాణ వ్యతిరేకులు అని ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూనే, మరో వైపు బీజేపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. మోదీ మాటలతో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, ఇందులో కేసీఆర్ పాత్ర లేదని తేలిందని చెబుతున్నారు. ఇలా మోదీ మాటలు రాజకీయంగా కాంగ్రెస్‌కు కూడా కాస్త ప్లస్ అయ్యేలా ఉన్నాయి..అలాగే దూకుడుగా ఉన్న బండి సంజయ్ కంటే రేసులో రేవంత్ రెడ్డి ముందుకొచ్చేలా చేశాయి.