రాప్తాడు టీడీపీ సీటు పరిటాల సునీతమ్మ ఫిక్స్ అయిపోయినట్లే..మరొకసారి సునీతమ్మ రాప్తాడు బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రాప్తాడు బరిలో దిగితే...వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సునీతమ్మ చెక్ పెట్టగలరా? ఆయన్ని ఓడించగలరా? అసలు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి ఉన్న బలం ఏంటి? తోపుదుర్తి సత్తా ఏంటి? అనే అంశాలని ఒకసారి చర్చించుకుంటే..రాప్తాడు అనేది పరిటాల ఫ్యామిలీ కంచుకోట అని చెప్పొచ్చు...నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో రాప్తాడు నియోజకవర్గం ఏర్పడింది..ఇక ఆ వెంటనే జరిగిన 2009 ఎన్నికల్లో సునీతమ్మ టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

అప్పుడు తోపుదుర్తి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు...2014 ఎన్నికల్లో కూడా సునీతమ్మ సత్తా చాటారు...వైసీపీ నుంచి పోటీ చేసిన తోపుదుర్తిపై విజయం సాధించారు..అలాగే చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు...2019 ఎన్నికలోచ్చేసరికి చంద్రబాబు ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ అన్నారు...దీంతో సునీతమ్మ సైడ్ అయ్యి..తన తనయుడు పరిటాల శ్రీరామ్‌ని రాప్తాడు బరిలో నిలబెట్టారు...కానీ అనూహ్యంగా తోపుదుర్తి విజయం సాధించారు..అలా పరిటాల ఫ్యామిలీకి తొలి పరాజయం వచ్చింది.

ఇక ఎన్నికలయ్యాక అనూహ్యంగా ధర్మవరం ఇంచార్జ్ పదవి శ్రీరామ్‌కు దక్కింది..దీంతో రాప్తాడు, ధర్మవరం బాధ్యతలు శ్రీరామ్ చూసుకుంటున్నారు...అయితే ఇటీవల ధర్మవరం సీటు శ్రీరామ్‌కు ఫిక్స్ అయింది...అంటే రాప్తాడు సీటు సునీతమ్మకు ఫిక్స్ అయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ రాప్తాడు బరిలో సునీతమ్మ నిలబడనున్నారు..అయితే ఎమ్మెల్యేగా ఉన్న తోపుదుర్తి స్ట్రాంగ్‌గా ఉన్నారు..గతం కంటే ఇప్పుడు బలం పెంచుకున్నారు.

అలా అని రాప్తాడులో పరిటాల ఫ్యామిలీ బలం గురించి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు..రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి సెపరేట్ ఫాలోయింగ్ ఉంది..పైగా గత ఎన్నికల్లో అంటే జగన్ గాలి ఉంది..ఈ సారి జగన్ గాలి ఉండదు..అలాగే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..ఈ పరిణామాలని బట్టి చూసుకుంటే తోపుదుర్తికి సునీతమ్మ చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి..అదే సమయంలో ప్రకాష్ ఇంకా దూకుడుగా పనిచేస్తే మళ్ళీ గెలిచే ఛాన్స్ కూడా ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: