ఎప్పటికప్పుడు ఎన్నికల్లో అభ్యర్ధులని మార్చడం అనేది రాజకీయ పార్టీలకు బాగా అడ్వాంటేజ్ అవుతుందనే చెప్పొచ్చు..ఎందుకంటే ప్రజల అభిప్రాయం ఎప్పుడు ఒకేలా ఉండదు.2014లో చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారు...2019 ఎన్నికల్లో జగన్‌కు అనుకూలంగా మారిపోయారు. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్తితులు మారిపోతాయి..అందుకు తగ్గట్టుగానే పార్టీలు రాజకీయం చేయాల్సి ఉంటుంది..అందుకే అనుకుంటా కుప్పంలో చంద్రబాబు అభ్యర్ధిని మార్చేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కుప్పంలో బాబుకు చెక్ పెట్టాలని చూస్తున్న వైసీపీ...నెక్స్ట్ కుప్పం అభ్యర్ధినే మార్చాలని చూస్తుందని సమాచారం. గత రెండు ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుపై చంద్రమౌళి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు..ఇక 2019 ఎన్నికల తర్వాత చంద్రమౌళి అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన తనయుడు భరత్‌కు కుప్పం ఇంచార్జ్ పదవి ఇచ్చారు...ఇక భరత్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్‌గా ఉంటూ వస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే కుప్పంలో రాజకీయం పెద్దిరెడ్డి నడిపిస్తున్నారు..ఆ మధ్య లోకల్ ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించడంలో పెద్దిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఇక లోకల్‌ ఎన్నికల్లోనే బాబుకు చెక్ పెట్టిన పెద్దిరెడ్డి...నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం బరిలో బాబుని ఓడించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయం నడిపిస్తున్నారు...అయితే కుప్పంలో బాబుకు పోటీగా భరత్‌ని పెడితే ఎంతవరకు పోటీ ఇస్తారనేది తెలియదనే చెప్పాలి. బాబు లాంటి వారిని ఓడించడం అంటే చాలా కష్టమనే చెప్పాలి...కాబట్టి భరత్ లాంటి సాఫ్ట్ అభ్యర్ధిని పెడితే ఉపయోగం ఉండదని తెలుస్తోంది.

అందుకే పెద్దిరెడ్డి తన సోదరుడు కుమారుడు సుధీర్ రెడ్డిని కుప్పం బరిలో నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ఎప్పటినుంచో కథనాలు వస్తున్నాయి...అయితే ఆ కథనాలని నిజం చేసేందుకు పెద్దిరెడ్డి చూస్తున్నారని తెలుస్తోంది. ఎలాగో భరత్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి..ఆయన్ని సైడ్ చేసి...తన సోదరుడు కుమారుడుని బాబుపై పోటీకి దింపడానికే మంత్రి పెద్దిరెడ్డి సిద్ధమవుతున్నారని సమాచారం. అంటే కుప్పం బరిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యర్ధి మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: