: 



మునుగోడు అసెంబ్లీ ఉపఎన్ని పోలింగ్ ముగియగానే కేసీయార్ మీడియా సమావేశం పెట్టి ఎంఎల్ఏల కొనుగోళ్ళ మీద చాలా మాట్లాడారు. ఈమధ్యనే టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎంఎల్ఏలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం బయటపడిందని కేసీయార్ అండ్ కో గోల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా అన్నట్లు మళ్ళీ తాజా మీడియాసమావేశంలో బీజేపీపైన మండిపడ్డారు. న్యాయం, ధర్మం, రాజ్యంగబద్దం అంటు చాలా మాటలే మాట్లాడారు.





బీజేపీవల్ల దేశంలో ధర్మం, న్యాయం, రాజ్యాంగం అంత సర్వభ్రష్టత్వం అయిపోతున్నట్లు రంకలేశారు. ప్రత్యర్ధిపార్టీలకు చెందిన ఎంఎల్ఏలను కొనుగోలు చేయటంలో బీజేపీ ఆరితేరిపోయిందన్నది నిజమే కావచ్చు. ఇప్పటికి అలా కొనుగోలుచేసే 8 ప్రభుత్వాలను కూల్చటమూ నిజమే కావచ్చు. కానీ అదేపని కేసీయార్ కూడా చేశారు కదా ? గడచిన ఎనిమిదన్నరేళ్ళల్లో కేసీయార్ చేసిందేమిటి ? టీడీపీ, కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంఎల్ఏలు సుమారు 36 మంది ఇపుడు టీఆర్ఎస్ లో ఎలాగున్నారు ?





వాళ్ళని లాక్కునేటపుడు కేసీయార్ కు న్యాయం, ధర్మం, రాజ్యాంగం గుర్తుకురాలేదు. ఎదుటిపార్టీల ఎంఎల్ఏలను కేసీయార్ లాక్కుంటే టీఆర్ఎస్ ఎంఎల్ఏలకు బీజేపీ గాలమేసిందంతే. కాకపోతే బీజేపీ చేసిన తప్పేమిటంటే టీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోలుకు బేరాలను హైదరాబాద్ లోనే చేయటం. ఇవే బేరాలు ఏ కర్నాటక, మహారాష్ట్రలోనో చేసుంటే సాఫీగా గడిచిపోయేవేమో. ఇక్కడ గమనించాల్సిందేమంటే టీఆర్ఎస్ ఎంఎల్ఏల కొనుగోళ్ళకు జరిగిన బేరసారాలు బయటపడినా ఇంతవరకు ఒక్క సీఎంకూడా ఎందుకని స్పందించలేదు ?





ఇక్కడే కేసీయార్ క్రెడిబులిటి తెలిసిపోతోంది. మిగిలిన సీఎంలందరికీ తెలుసు టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలను కేసీయార్ ఎలా లాక్కున్నారో. ఇందుకనే ఏ ముఖ్యమంత్రి కూడా కేసీయార్ ను పట్టించుకోలేదు. బేరసారాల వీడియో టేపులను అందరు ముఖ్యమంత్రులకు పంపుతాము, పార్టీల అధ్యక్షులకు పంపుతాము, జడ్జీలకు పంపుతామంటే ఏమవుతుంది దానివల్ల. కేసీయార్ పద్దతిగా ఉండుంటే అప్పుడు బీజేపీని ఏమి విమర్శించినా చెల్లుబాటవుతుంది. మొత్తానికి బేరసారాల ఘటనతో కేసీయార్ కున్న క్రెడిబులిటియే బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: