
ఇక ఇటీవల ఇలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అన్నది తెలుస్తోంది. ఇక్కడ ఒక వ్యక్తి సాధించిన రికార్డు గురించి తెలిసిన తర్వాత రియల్ బాహుబలి అంటే ఇతనేనేమో అనే భావన ప్రతి ఒక్కరి మనసులో కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఏకంగా 165 కిలోల బరువును పళ్ళతో అలవోకగా ఎత్తేసాడు. అంతే కాదు పది సెకండ్ల పాటు బరువును ఇక తన పళ్ళతోనే పైకి లేపి పట్టి ఉంచి ప్రపంచ రికార్డులను నమోదు చేశాడు అని చెప్పాలి. సాధారణంగా నోటి పళ్ళతో ఇక చిన్న చిన్న బరువులను ఎత్తడానికే చాలా కష్టం. అలాంటిది 165 కిలోల బరువు ఎత్తి ప్రపంచ రికార్డు కొట్టడంతో రియల్ లైఫ్ బాహుబలి అంటూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ.
బీహార్ లోని కైమూరు జిల్లాకు చెందిన ధర్మేంద్ర కుమార్ ఈ రికార్డు సృష్టించాడు. త్రిపుర లోని అగర్తలకు చెందిన నేతాజీ వరల్డ్ రికార్డు ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో ఇక ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. అతను ఇప్పటివరకు 9 ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. హ్యామర్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా కూడా పేరు సంపాదించాడు. గత ఏడాది డిసెంబర్లో అగర్తలో జరిగిన పోటీలో 122 కిలోల బైకును భుజంపై మోస్తూ 30 సెకండ్లలో 100 మీటర్ల పరుగును పూర్తి చేసాడు. అంతకుముందు తలతో కొబ్బరికాయలు పగలగొట్టడం.. పళ్ళతో ఇనుము వంచటం లాంటి ఎన్నో అరుదైన రికార్డులు కూడా ఈయన పేరుతో ఉన్నాయి అని చెప్పాలి. కాగా ధర్మేంద్ర త్రిపుర రైఫిల్స్ విభాగంలో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.