
ఈ క్రమంలోనే ఇక్కడ హోలీ పండుగ పుణ్యమా అని భార్యామణులు అందరూ కూడా భర్తల భరతం పట్టేశారు. సన్నని బరిగెలతో వరసైన వారి వీపులను విమానం మోత మోగించేశారు భార్యలు. ఇంకేముంది చేసేదేమీ లేక పురుషులు అందరూ కూడా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా గిరిజన తండాలో హోలీ సంబరాలు మరింత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది హోలీ మధ్యకాలంలో భూక్య, లకావత్, తేజవత్, బడిత్య వంశస్థుల కుటుంబాల్లో ఎవరికైతే తొలి సంతానంగా మగ బిడ్డ జన్మిస్తాడో ఇక ఇంట్లో డోండ్ వేడుక వైభవంగా నిర్వహించాలి.
ఈ క్రమంలోనే కారేపల్లి మండలం సామ్య తండాలో భూక్యా నగేష్, సుజాత దంపతులకు తొలి సంతానంగా మగ బిడ్డ జన్మించాడు. ఇక డోండ్ అంటే గిరిజన భాషల్లో వెతకడం అని అర్థం. అంటే బాలుడిని ఒక ఇంట్లో దాచిపెట్టిన తర్వాత గ్రామస్తులు అందరూ కూడా ఇక బాలుడిని వెతుకుతూ వేడుక జరుపుకుంటారు. అంతేకాకుండా ఇక గుంజా పాతి, తినుబండారాలు ఉన్న రెండు గంగాలాలను తాళ్లతో కట్టేశారు. ఇక వీటికి మహిళలు పచ్చి బరిగెలు చేతిలో పట్టుకుని కాపలాగా ఉంటే పురుషులు వాటిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఇలా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన పురుషులను మహిళలు సరదాగా కొట్టడం చూస్తూ ఉంటాం. అయితే ఇదంతా సరదా కోసమే కొట్టినప్పటికీ.. అటు పురుషులు వీపు విమానం మోత మోగిపోతూ ఉంటుంది అని చెప్పాలి.